ఎన్టీఆర్ కు మరణం లేదు


మద్రాసులో శోభనాచల స్టూడియోలోకి అడుగుపెట్టి, ఒక 5'-10"ల అందగాడు గంభీరంగా నడిచివస్తుంటే "ఇలాంటివాడు నా చిత్రానికి హీరో అయితే ఎంత బాగుండును" అని బి.ఎ.సుబ్బారావు మనసులో అనుకుంటుండగానే", బి.ఎ.సుబ్భారావు గారు ఎక్కడ ఉంటారని ఎన్.టి.ఆర్. అడగడం తర్వాత వారి పరస్పర పరిచయాలూ ఇవన్నీ సుబ్బారావు మనస్సుమీద చెరగని ముద్రవేశాయి. స్క్రీన్ టెస్టులూ, ఇతర పరీక్షలూ ఏమీ అవసరంలేదని త్రోసిపుచ్చి సుబ్బారావు వెంటనే వెయ్యి నూటపదహార్లు అడ్వాన్సుగా ఇచ్చి కాంట్రాక్టుపై సంతకం చేయించుకున్నాడు. అదే ఎన్.టి.ఆర్. తొలి సంపాదన,

అయిదడుగుల పదంగులాలు ఎత్తు వుండి 80కేజీల బరువు రామారావు గారిది. ఆయన ధరించే పాత్రలకు అన్ని విధాల సరిపోయేందుకు తగిన పర్సనాలిటి . అది ఆయనకొక వరం అంటారు సినీనటుడు జగ్గయ్యగారు. అలా తన శరీరాన్ని తన అదుపులో వుంచుకోవడానికి చాలా శ్రమపడతారు . అందుకు ఆయన తీసుకునే ఆహారం విషయంలో కూడా ఎంతో శ్రద్దవహిస్తారు. “ఉదయాన్నే సెట్స్ మీదికి వెళ్ళే ముందు ఒక్క ముద్ద గోదుమ అన్నం,లేదా ఆమ్లెట్,ఇడ్లీలు,లేదా పెసరట్టు లేదా దోసె ఆతర్వాత టీ ఇది ఉదయం ఫలహారం. మధ్యాన్నం చాపాతీలు, చికన్,ఒకటి రెండు కూరగాయలు భోజనంగా తీసుకుంటాను


షూటింగ్ సమయంలో ఆయనకు నాలుగుమార్లు చెయ్యి విరిగింది. ఒకసారి పాము కరిచింది. ఒకసారి కుక్క కరిచింది.ఇంకోసారి ఎడ్లబండి ఎదపై నుండి వెళ్ళింది. ఇంకోసారి కత్తి దెబ్బతగిలింది. ఇలా భయంకరమైన ప్రమాదాలు జరిగినా మళ్ళీ చిత్రీకరణకై సిద్దంగా ఉండేవారు ఎన్టీరామారావుగారు. ఒక ముఖ్యమైన సంఘటన 1956వ సంవత్సరంలో జరిగింది. “చిరంజీవులు” చిత్రం షూటింగ్‌లో ఎన్టీరామారావుగారికి ఒక ఘోరమైన ప్రమాదం సంభవించింది. ఎన్టీఆర్ అ చిత్రంలో గ్రుడ్డివాడుగా నటించవలసి వచ్చినప్పుడు కళ్ళలో కాంటాక్ట్‌ లెన్స్ వాడవలసి వచ్చింది. దానివల్ల ఏ కారణం చేతనో కళ్ళు పూర్తిగా కనబడకుండాపోయాయి. దానికి గాను నందమూరి రాముడు మూడు రోజులు తన గృహములోని గది నుండి బయటకు రాలేదు. ఆ విషయం గురించి తెలుసుకోగా ఆ మూడు రోజులు కేవలం నా కళ్ళు నాకిప్పించమని దైవాన్ని ప్రార్థించాను అన్నారు.అంతే ఆ భగవంతుడు ఆయన ప్రార్ధనను మన్నించాడు కాబోలు

వస్త్రాలంకరణ, కేశాలంకరణ(హెయిర్ స్టైల్), కిరీటాలు, మేకప్ గురించి ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. పౌరాణిక చిత్రాలలో కార్ట్‌బోర్డ్‌తో చేసిన కిరిటాలనే లోగడ ఎక్కువగా వాడేవారు. ఇత్తడి మొదలైన లోహకిరిటాలు ఎక్కువ బరువు వుండటం వలన కళాకారులకు అయాసం ఎక్కువౌతుందని అవి వాడేవారుకారు. ఎన్టీఆర్ మాత్రం కార్ట్‌బోర్డ్‌తో తయారు చేసినవి వాడకుండా లోహకిరిటాలనే వాడేవారు.




Posted in |

0 comments: