చిందులేశిన అనుష్క అభిమాని


సినీ తారలకు ఎవరికైనా హిట్లు వస్తే ఓ పట్టాన మాట వినరని అంటుంటారు. ఇది చాలా మంది నటీనటుల విషయంలో రుజువైంది కూడాను. ఈ జాబితాలో ఇప్పుడు కొత్తగా సెక్సీ నటి అనుష్క కూడా చేరిపోయినట్లు కనిపిస్తోంది. వరుస హిట్లు, ఆఫర్లతో అమ్మడికి తలబిరుసు ఎక్కువైందంటున్నారు.తరువాత చెపుదాం .......
ఇదిలా ఉంటే తమిళనటుడు విజయ్‌తో కలిసి ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రం తాలూకు షూటింగ్ గత కొద్ది రోజులుగా రాజమండ్రిలో జరుగుతోంది. ఇందులో భాగంగా రాజమండ్రి రైల్వే స్టేషన్లో షూటింగ్ చేస్తుండగా, ఓ అభిమాని ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరాడట. అయితే అనుష్క అదేమీ పట్టనట్లు నడుచుకుంటూ వెళ్లిపోయిందట. అయినా వదలని ఆ వీరాభిమాని అనుష్కను ఆటోగ్రాఫ్‌కోసం పదే పదే బతిమాలాడట. అయినా ఇవ్వకపోవడంతో చిర్రెత్తిన ఆ అభిమాని, "అరుంథతి హిట్‌తో నీకు పొగరెక్కిందా... అసలు ఆ చిత్రం నీ వల్ల హిట్ అవలేదు. అందులో రాక్షసుడు పాత్ర సోనూసూద్ వల్ల, సాయికుమార్ తమ్ముడు రవి వాయిస్ వల్ల హిట్ అయింద"ని చిందులేశాడట. ఇది చూసిన యూనిట్ సభ్యులు అవాక్కయ్యారట. చివరికి ఏమనుకుందో ఏమో గానీ తన అభిమానిని పిలిపించమని చెప్పిందట. కానీ అప్పటికే ఆ అభిమాని గొణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడట.

Posted in |

0 comments: