రవితేజ"ఆంజనేయులు"


'ఇడియట్', 'నేనింతే'లాంటి టైటిల్స్‌కి సరిగ్గ సరిపోయి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రవితేజ తాజాగా "ఆంజనేయులు" అనే పేరుతో తెరపైకి రానున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై గణేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆదివారం రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవ పూజాకార్యక్రమాలను పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ హాజరై నిర్వహించారు. ఆయన భార్య రేణూదేశాయ్ క్లాప్ కొట్టగా, బొత్సా సత్యనారాయణ కెమేరా స్విచ్చాన్ చేశారు. వినాయక్ తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు.గత కొంత కాలంగా" విక్రమార్కుడు తరువాత "సరైన సినిమాలేని రవితేజ ఈ సినిమాతో తనసత్త"ప్రతిభ" మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు చూపబోతనాని అనుకుంటున్నాడు


Posted in |

0 comments: