రాజ్యపాలన అంతంలో తీవ్రవాఖ్యలు"మన్మోహన్ సింగ్"


కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ.. ప్రతిపక్ష బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎల్‌కే అద్వానీపై నిప్పులు చెరిగారు. ఆయన దేశానికి ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో కీలక పాత్ర పోషించారని, గుజరాత్ అల్లర్లకు నేతృత్వం వహించారని, ఎన్డీఏ హయాంలో హోంమంత్రిగా పార్లమెంట్, ఎర్రకోటపై జరిగిన ఉగ్రవాద దాడులను అడ్డుకోలేకపోయారని విమర్శించారు

మన్మోహన్ సింగ్‌ను బలహీనమైన ప్రధానిగా గత ఐదేళ్లకాలంలో అద్వానీ పదేపదే విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలను కూడా మన్మోహన్ సింగ్ తిప్పికొట్టారు. హోంమంత్రిగా దేశ సంక్షేమానికి ఆయనేం చేశారని ప్రశ్నించారు.


Posted in |

0 comments: