విరొధి శుభాకాంక్షలు


విరొధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఉగాది రొజు సంతొషంగా ఉంటే సంవత్సరం మోత్తం అలాగే సాగుతుందని మన పెద్దల నమ్మకం మన టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి ఈరొజు హ్యాపిగా ఉందాం






Posted in | 2 comments

ఆకాశమంతా పాటలు

Posted in | 1 comments

మన దగ్గరనుంచి కొట్టేసిన సంపద

గాంధిజీ వస్తువులు
టిప్పు సుల్తన్ ఖడ్గం

మన దగ్గరనుంచి కొట్టేసిన సంపదని అమ్ముకుంటు దానికి గౌరవంగా వేలం అని పేరుపెట్టి మన జాతి సంపదను అమ్ముకొని లబ్ది పొందటం అనేది ఎంత గొప్ప పనో విదేశీయులకు మన ప్రభుత్వం చెప్పి తీరాలి లేదంటే {నిన్న మహత్మగాంధి వస్తువులు నేడు టిప్పు సుల్తన్ వీ ఇలా చెప్పుకుంటు పోతే ఇంకా ఎన్నెన్నో ఉంటాయి} మన జాతీయ సంపద ఇతర దేశల పాలవుతుందీ మరి ఇప్పటికైనా అ వేలలని ఆపుచేయాలి అది మన దేశ తక్షణ కర్తవ్యం అని నేను భావిస్తున్నాను మరి మీరు మీ అభిప్రాయం తెలియజేయండి 

Posted in | 0 comments

ఫ్రీగా సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ చేయలనుకుంటే మీకోసం ఈ సదుపాయం

Posted in | 0 comments

7పరుగులు ఒక్క బంతికి

Posted in | 0 comments

రవితేజ"ఆంజనేయులు"


'ఇడియట్', 'నేనింతే'లాంటి టైటిల్స్‌కి సరిగ్గ సరిపోయి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రవితేజ తాజాగా "ఆంజనేయులు" అనే పేరుతో తెరపైకి రానున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై గణేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆదివారం రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవ పూజాకార్యక్రమాలను పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ హాజరై నిర్వహించారు. ఆయన భార్య రేణూదేశాయ్ క్లాప్ కొట్టగా, బొత్సా సత్యనారాయణ కెమేరా స్విచ్చాన్ చేశారు. వినాయక్ తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు.గత కొంత కాలంగా" విక్రమార్కుడు తరువాత "సరైన సినిమాలేని రవితేజ ఈ సినిమాతో తనసత్త"ప్రతిభ" మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు చూపబోతనాని అనుకుంటున్నాడు


Posted in | 0 comments

COMMON SYMBOL కామన్ సింబల్ "వాయిద పద్దతుంది దేనికైనా ఉందిగా 24 తరువాత 27"

{కామన్ సింబల్}
ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి గుర్తు కష్టాలు ఇపుడే తీరేలా కనిపించడం లేదు. కామన్ సింబల్ కేటాయించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ప్రజరాజ్యం పార్టీ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఉమ్మడి గుర్తు సమస్య ఆ పార్టీని వెంటాడుతూనే ఉంది ఇప్పటికే చాల మంది వౄద్దులు ప్రజరాజ్యం గుర్తు తెలియక చాల ఇబ్బంది పడుతున్నారు మరి ప్రజరాజ్యం పార్టి త్వరగ ఈ విషయన్ని ఒక కొలిక్కి తేవాలి లేకపోతే ప్రజరాజ్యంకి కొన్ని ఓట్లు తప్పక పోతాయి ముఖ్యంగా ముసలివారు  
ఎందుచేతననగా:అసలే ఓట్లు వేసేచోట చాల రద్దిగా హాడవిడిగా ఉంటుందీ అంత హాడవిడిలో గుర్తు గుర్తుంచుకొని వేయటం అనేది వౄద్దులకి కొంచం కష్టం దానికి తోడు చదువురాని వారి సంగతి చెప్పనక్కర్లేదు

Posted in | 0 comments

కే.సి.ఆర్.దొంగరాజకీయం

నేడు చర్చలు


నిన్నవిడిపోవటం
మొన్నకలవటం
రాజకీయనాయకులకు 2నాలుకలు అంటారుగాని అది చాలా పెద్ద తప్పు 100నాలుకలు అని చెప్పుకోవచ్చూ దానికి నిదర్శనం మన తెలంగాణా ని ఏదో చేశేద్దాం అనుకొనే కే.సి.ఆర్ గారు నిన్న, మొన్న చెతులుకలుపుకు తిరిగి రాత్రికి రాత్రి ఎన్నికలలో పొత్తులేదు అని చెప్పి తన కార్యకర్తల తో పాటు ప్రజలని కూడ నమ్మించగలను అనుకోనే ఈయన రాజకీయం అంటే తన ఇంటి వెనక పెరట్లో నీళ్ళు పోయడం అనుకుంటున్నాడు నిన్న అ మాటచెప్పి ఒక్కరోజు కూడ కాలేదు మళ్ళీ చర్చలు అంటు మీటింగులు పెట్టుకోవడం ఈ మహాకూటమికే చెల్లిందీ ఎటువంటి ఎజెండా లేకుండ ఒక్క కాంగ్రెస్ ని ఓడించడానికే ప్రయత్నిస్తున్న ఈ మహకూటమి పొత్తులు రాజకీయ్యపు కుట్రగా అభివర్ణించడంలో తప్పేమిలేదు మరి మీ అభిప్రాయం  

Posted in | 0 comments

చిందులేశిన అనుష్క అభిమాని


సినీ తారలకు ఎవరికైనా హిట్లు వస్తే ఓ పట్టాన మాట వినరని అంటుంటారు. ఇది చాలా మంది నటీనటుల విషయంలో రుజువైంది కూడాను. ఈ జాబితాలో ఇప్పుడు కొత్తగా సెక్సీ నటి అనుష్క కూడా చేరిపోయినట్లు కనిపిస్తోంది. వరుస హిట్లు, ఆఫర్లతో అమ్మడికి తలబిరుసు ఎక్కువైందంటున్నారు.తరువాత చెపుదాం .......
ఇదిలా ఉంటే తమిళనటుడు విజయ్‌తో కలిసి ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రం తాలూకు షూటింగ్ గత కొద్ది రోజులుగా రాజమండ్రిలో జరుగుతోంది. ఇందులో భాగంగా రాజమండ్రి రైల్వే స్టేషన్లో షూటింగ్ చేస్తుండగా, ఓ అభిమాని ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరాడట. అయితే అనుష్క అదేమీ పట్టనట్లు నడుచుకుంటూ వెళ్లిపోయిందట. అయినా వదలని ఆ వీరాభిమాని అనుష్కను ఆటోగ్రాఫ్‌కోసం పదే పదే బతిమాలాడట. అయినా ఇవ్వకపోవడంతో చిర్రెత్తిన ఆ అభిమాని, "అరుంథతి హిట్‌తో నీకు పొగరెక్కిందా... అసలు ఆ చిత్రం నీ వల్ల హిట్ అవలేదు. అందులో రాక్షసుడు పాత్ర సోనూసూద్ వల్ల, సాయికుమార్ తమ్ముడు రవి వాయిస్ వల్ల హిట్ అయింద"ని చిందులేశాడట. ఇది చూసిన యూనిట్ సభ్యులు అవాక్కయ్యారట. చివరికి ఏమనుకుందో ఏమో గానీ తన అభిమానిని పిలిపించమని చెప్పిందట. కానీ అప్పటికే ఆ అభిమాని గొణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడట.

Posted in | 0 comments

రాజ్యపాలన అంతంలో తీవ్రవాఖ్యలు"మన్మోహన్ సింగ్"


కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ.. ప్రతిపక్ష బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎల్‌కే అద్వానీపై నిప్పులు చెరిగారు. ఆయన దేశానికి ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో కీలక పాత్ర పోషించారని, గుజరాత్ అల్లర్లకు నేతృత్వం వహించారని, ఎన్డీఏ హయాంలో హోంమంత్రిగా పార్లమెంట్, ఎర్రకోటపై జరిగిన ఉగ్రవాద దాడులను అడ్డుకోలేకపోయారని విమర్శించారు

మన్మోహన్ సింగ్‌ను బలహీనమైన ప్రధానిగా గత ఐదేళ్లకాలంలో అద్వానీ పదేపదే విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలను కూడా మన్మోహన్ సింగ్ తిప్పికొట్టారు. హోంమంత్రిగా దేశ సంక్షేమానికి ఆయనేం చేశారని ప్రశ్నించారు.


Posted in | 0 comments

మీ బ్లాగు ని మరింత అందంగా తీర్చి దిద్దడం ఎలా?

Posted in Labels: , , | 1 comments