మనిషిని చంపే హక్కు పోలీసులకెక్కడిది..?
Posted On Tuesday, February 10, 2009 at at 12:24 AM by MOVIEతీర్పు పాతదే… : కె.రాజారత్నం నాయుడు, నిజామాబాద్ రేంజ్ డిఐజి బాధితులకు కాస్త వెసులుబాటు… : మాధవరావు, ఎపీపీసీఎల్సీ జిల్లా నేత ఇక పోలీసులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిందే… పోశెట్టి, తెరాస జిల్లా అధ్యక్షులు
గతంలో మాదిరిగానే ఈ తీర్పు ఉంది. ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత రిపోర్టును ఇప్పటికీ మెజిస్ట్రేట్‌కు పంపుతాం. ఇపుడు కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నాం.. కోర్టుకు పంపిస్తున్నాం. అడవిలో సాయుధులైన తీవ్రవాదులు ఎదురుపడితే తప్పనిసరై ఆత్మరక్షణ కొరకు ఎదురుకాల్పులకు దిగాల్సి వస్తుంది. అంతేగానీ అనవసరంగా ఎవరి ప్రాణాలను తీయాలని పోలీసులకుండదు.
ఎన్‌కౌంటర్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు హైకోర్టు తీర్పు కాస్త వెసులుబాటును కల్పించింది. అయితే గతంలోనూ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేవారు. పోలీసుల మీద హత్యాప్రయత్నం జరిగిందంటూ 307 కింద కేసు నమోదు చేసేవారు. ఫైనల్ రిపోర్టును మెజి్స్ట్రేట్‌కు పంపిస్తారు. ఇందులో 95 శాతం కేసులు పెండింగ్‌లోనే ఉంటాయి. అయితే తాజా తీర్పు వల్ల పోలీసులు చెప్పిన కారణాన్ని రుజువు చేయాల్సి వస్తోంది. కోర్టులో వారికి ప్రతికూలంగా గానీ..అనుకూలంగానీ తీర్పు రావచ్చు. దీంతో భయస్తులైన పోలీసులు ఎన్‌కౌంటర్ల జోలికి వెళ్లరు. కానీ, ఇపుడు కూడా పోలీసులు తప్పించుకునేందుకు అనేక మార్గాలున్నాయి. ఇది కేవలం విధినిర్వహణలో భాగంగానే చేశాం అంటూ తప్పించుకునే అవకాశాలూ ఉన్నాయి.
బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో పోలీసులు అమాయకులను అనవసరంగా చంపకుండా హై కోర్టు సరైన నిర్ణయం తీసుకుంది. పోలీసులు చంపాలనుకున్న వారిని తీవ్రవాదులను చేసి పట్టుకెళ్లి చంపుతున్నట్లు పత్రికల్లో చూస్తున్నాం. అలాంటి ఘటనలు ఇక జరగకుండా ఉంటాయి. పోలీసులపై చర్యలు తీసుకునేందుకు ఈతీర్పు దారి సుగమం చేసింది.