చంద్రబాబుకి ఆవేశం కొరవడిన సమయం!
Posted On Friday, February 13, 2009 at at 2:46 AM by MOVIEరాజకీయంనిత్యం గొంతు చించుకుని వంద కబుర్లు చెబుతూ, వెయ్యి విమర్శలు చేసే చంద్రబాబు నాయుడు, మొన్న సాక్షి పేపర్లో వచ్చిన వార్తలపై స్పందించక పోవడం నిజంగా విడ్డూరం. ఇన్నాళ్ళు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నాయకులెవరినీ క్షమించని బాబు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో తనకే తెలియాలి.
అప్పట్లో గెల్లి రమేష్ ని సైలెంట్ గా వెనుకేసుకొచ్చారు. ఫలితంగా GTB బ్యాంకు మునిగిపోయింది. ఇప్పుడు సొంత కంపెనీ లావాదేవీలలో అవకతవకలు జరిగాయని విమర్శలు వచ్చినా ఈ మాత్రం ఉలికి పాటు లేదు. ఎందుకనో. తమ కంపెనీలో స్కాము జరిగిందా లేదా అనే విషయం పక్కన పెడితే, కనీసం సాక్షిలో వచ్చిన విధంగా లావాదేవీలు జరిగాయో లేదో, జనానికి చెప్పాలి. అది చెపితే అందులో వీరి పాత్ర ఉందొ లేదో జనం అర్థం చేసుకోగలరు.
ఇంతా చేసి ఈనాడులో ఈ వ్యవహారం పైన అస్సలు వార్తలు లేకపోవడం (ఉండి, ఒక వేళ నాకు కనిపించేలేదో తెలియదు కానీ) అస్సలు సిస్సలు 'payback'. మార్గదర్శి వ్యవహారంలో ఈనాడుకి బాబు సప్పోర్టు ఇచ్చాడు, ఇప్పుడు బదులుగా వీళ్ళు దానికి తిరిగి బదులుగా బాబు గారి చేసిన ఉండవచ్చు అనే స్కాముని కవర్ చేయడం లేదు. బాగుంది. బాగుంది.