రెహమాన్ కె పాస్ మా హై
Posted On Wednesday, February 25, 2009 at at 6:15 AM by MOVIE
"నా దగ్గర డబ్బుంది, కార్లున్నయి, బంగ్లాలున్నాయి నీదగ్గరేముంది"......"నా దగ్గర అమ్మ ఉంది" సలీం జావెద్ ల పాపులర్ డైలాగ్ రెహమాన్ అస్కార్ గెలిచిన వేళ చెప్పిన మాట అమ్మే అతనికి అన్ని నేర్పింది "మా అమ్మ నాకు మార్గదర్శి తను నా బిజినెస్ పార్ట్నర్" ఇవి రెహమాన్ గుండే లొతుల్లొంచి అతని సంగీతం కన్నా హ్రుద్యంగా వచ్చిన మాటలు చిన్న వయసులొ భర్తని కొల్పొయి కుటుంబ భారన్ని మోయాల్సిన పరిస్తితిలొ రెహమాన్ ని మాములు చదువులవైపు కాకుండా సంగీతం వైపు ప్రొత్సహించడం వినటానికి సాదారణంగా వున్నా ఆ పరిస్తితి వుండి ఆలొచిస్తే ఆవిడ ఎంత ధైర్యశాలొ అర్దమౌతుంది బహుశా తను అప్పటికే సహాయ సంగీత దర్శకుడిగా వున్న తన భర్త గురించి కన్న కలల్ని కుమారుడి ద్వార సాకారం చెసుకుందేమొ ఆ కలలే రహమాన్ ని ఇంతదూరం చేర్చి నట్టుంది భారతీయ పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై సగర్వం గా ఎగరడానికి దొహదం చెసినట్టున్నయి ఎవరొ గొప్ప వ్యక్తి చెప్పారు "నువ్వేదయినా కలని నిజాయితీ పట్టుదలతొ కలిపావంటె ప్రపంచం నిన్ను గెలిపించడానికి కుట్ర పన్నుతుంది" బహుశా అందుకేనెమొ చిన్నతనం లొ అన్నికష్టాలు పెట్టి 14 ఎళ్ళకె రెహమాన్ ని కీబొర్డ్ ప్లేయర్ చెయ్యడానికి కుట్రపన్నింది అల్లా రఖా రెహమాన్ గా మార్చింది "అతని సూఫి సంగీతం లొ దైవత్వం ఉంది" పాకిస్తాని సూఫి సంగీత విద్వాంసుడు మునీర్ చెప్పిన మాట ఇది రెహమాన్ సంగీతపు లొతుల్ని తెలుపుతుంది యాద్రుచ్చికంగానొ, దైవెచ్ఛొ అతని మొదటి పాట "జాబిలిని తాకి ముద్దులిడు ఆశ వెన్నెలకు తొడై ఆడుకొను ఆశ " బహుశా రెహమాన్ కి అంతరిక్షమే హద్దేమొ రెహమాన్ ఒక విజేత
చాలా బాగా రాశారు రహమాన్ గురించి..!
అభినందనలు మీకు.
ఆ ప్రభువు నాకు రెండు త్రోవలు చూపాడు. ఒకటి ప్రేమ, రెండు ద్వేషం. నేను ప్రేమ ని ఎన్నుకున్నాను అని కూడా అన్నాడు.