గూగుల్ వాడి తెలుగు తగలెయ్య !

?


 రోజు నేను, నా మిత్రుడు ఒకరు GChat లో ఫలానా సమయంలో మాట్లాడదామని ముందుగానే నిర్ణయించుకున్నాం. అనుకున్న సమయానికి ఇద్దరము GChat లోకి రావడం జరిగింది కానీ ఒకరికొకరం GChat లో  on-line లో ఉన్నట్టు కనిపించకపోవటంతో తను Google లో కొత్త అకౌంట్ తెరవమని invitation పంపించాడు. ఇంతలో ఒకరికొకరు on-line లో చూసుకోవటంతో వెంటనే కబుర్లలో పడిపోయాము. కొంతసేపటి తరువాత సరే ఏదో కొత్త మెయిల్ వచ్చింది కదా అని open చేసి చూసా. ఆ invitation అంతా తెలుగులోనే ఉండటం ఒకటైతే, అందులోనూ ఇది నేను మొదటి సారిగా చూడటంతో కొంచెం ఓపిక చేసుకొని మెల్లగా చదవటం మొదలు పెట్టా. అందులో ఉన్న చాలా తెంగ్లీష్ పదాలు, ముఖ్యంగా సాంకేతిక పదాలు తెలుగులో వాడిన విధానం మనం కూడా వాడుతున్నాము కనుక అంత పెద్ద ఆశ్చర్యపరచలేదు కానీ ఒక్క పదం/వాక్యం మాత్రం దిమ్మతిరిగి పోయేటట్టు చేసింది.

అది మీకోసం ఇక్కడ ......

ఒకసారి మీరు అకౌంట్ని తెరిస్తే, <నా మిత్రుని పేరు ఇక్కడ> అది మీ ఇమెయిల్ అడ్రస్లో పొందుపరచబడుతుంది కాబట్టి మీరు Gmail తో సంపర్కంలో ఉండవచ్చు. 

Posted in |

0 comments: