తెలంగాణా వస్తే ఆంద్రకు రాజధాని ఏది?
Posted On Monday, February 16, 2009 at at 11:45 PM by MOVIEఅన్ని పార్టీలు తెలంగానం చేస్తున్నాయి దేశచరిత్రలో ఒక రాష్ట్రం కోసం అన్ని పార్టిలు ఇలా ఏకతాటిపై నిలవలేదు ప్రత్యేక రాష్ట్రం దాదాపు ఖరరైన ఈ సమయంలొ విడిపొయిన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏదైతె బావుంటుంది అని "రాజు గారు" నిర్వహిస్తున్న అబిప్రాయ సేకరణలో పాలుపంచుకోవల్సిందిగా బ్లాగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం
ఒంగోలు.
విజయవాడ-గుంటూరు జంట నగరాలు
కర్నూలు. ఇప్పటికే ఒకసారి రాజధానిగా వెలిగింది. నట్టనడిబొడ్డునుంది.
Tanuku
pulivendula
naara vaari palli
mogaltooru
ఎవరేమన్నా ఇవేవీ కావు. రాయల సీమ నేతలు ప్రత్యేక రాష్ట్రం కోరుకోకుండా ఆంధ్రతో కలిసుండాలంటే రాజధాని రాయల సీమలోనే ఉండాలంటారు. అది తప్పదు. అయితే అది కర్నూలు ఎంత మాత్రమూ కాదు. విజయవాడ, విశాఖ పట్నం తరువాత పెద్ద పట్టణమైన "తిరుపతి"కే ఆ ఛాన్స్ ఉంది. అక్కడ యాభయ్యేళ్ళ నాటి విశ్వవిద్యాలయం ఉంది. "స్విమ్స్" వంటి సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ ఉంది. రాజధాని అభివృద్ధికి కావలసినన్ని టి.టి.డి. నిధులున్నాయి. అయితే.. గియితే పనికొస్తుందని రాజశేఖరరెడ్డిగారు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయిస్తున్నారు. అన్నిటికీ మించి పుణ్యక్షేత్రంగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన పట్టణం. పైగా వేంకటేశ్వర స్వామి సెంటిమెంట్ తో ఆంధ్ర ప్రాంతీయులు కూడ కాదనలేరు.
rayala seema to kalisuntea ippudu telanganetarulugaa choodabadutunna andraa prantam vallu "rayalaseemetarulu" gaa choodabadataru
విజయవాడ-గుంటూరు జంట నగరాలు
ఎండా కాలంలో విజయవాడ, చలికాలంలో వైజాగ్, వర్షాకాలంలో తిరుపతి.
దీనికోసం ఎవరైనా వోటింగ్ పెడతారా, విశాఖే రాజధాని ( రెండు రెళ్లెంత అంటే ఎవరైనా క్యాలుక్కలేటర్ నొక్కమంటారా ;) )
eluru
మీ ప్రశ్నే తప్పు. సమస్య ఆంధ్రకి రాజధానేదనేది కాదు. అదెప్పటికీ హైదరాబాదే. తెలంగాణకి రాజధానేదని అడగాలి. కరీంనగర్ బాగుంటుందేమో.
రావులపాలెం
అబ్రకదబ్ర గారూ!
మీకు చరిత్ర, భూగోళ శాస్త్రాలలో గల పరిజ్ఞానం చూస్తే నవ్వు వస్తుంది. ఎప్పుడయినా ఆంధ్ర ప్రదేశ్ పటంలో హైదరాబాదు ఎక్కడుందో చూసారా? ఆంధ్ర, తెలంగాణ వేరయ్యాక - ఆంధ్ర రాష్ట్రం వదలి తెలంగాణలో ప్రవేశించి కనీసం రెండు జిల్లాలు దాటితేగాని, హైదరాబాదు రాదు. అలాంటప్పుడు రాష్ట్రం ఒకచోట - రాజధాని పక్క రాష్ట్రంలో రెండు జిల్లాలు దాటాక మరోచోటా ఎలా ఉంటుంది? మీకే కాదు. సమైక్య వాదులుగా చెప్పుకొనే చాలా మందికి ఈ మాత్రం ఆలోచనా జ్ఞానం ఉండకపోవడం ఎప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. దీనిని బట్టి వీరికి రాష్ట్రం విడిపోతే, తెలంగాణ పేరుతో గల కొంత తెలుగు ప్రాంతంతోబాటు, కొందరు తెలుగు సోదరులు వేరైపోతారన్న బాధ కన్న - హైదరాబాదును కోల్పోతామన్న ఆవేదనే ఎక్కువ అని తెలుస్తోంది. ఇది చాలు - వీరిది "కుహనా సమైక్య వాద"మని చెప్పడానికి. అయితే, గియితే - "మాకు దక్కని హైదరాబాదు తెలంగాణ వారికి కూడ దక్కకూడ"దన్న కుళ్ళుతో దానిని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారేమో గాని, ఎట్టి పరిస్థితులలోనైనా రాష్ట్రం విడిపోయాక - హైదరాబాదు ఆంధ్రకు రాజధాని కావడం అసంభవం.
"కొందరు తెలుగు సోదరులు వేరైపోతారన్న బాధ కన్న - హైదరాబాదును కోల్పోతామన్న ఆవేదనే ఎక్కువ అని తెలుస్తోంది." - నేను విడిపోతా, నేను వేరుపడతా, నువుబోయి నీ రాజధానిని ఏర్పాటు చేసుకో అంటూ మాట్టాడేవాళ్ళకు లేని "సోదర" బాధ అవతలాడికెందుకుండాలంట?
విడిపోయి వేరే రాష్ట్రం ఏర్పాటు చేసుకుని, వేరే రాజధాని ఏర్పాటు చేసుకోవడం కాదిది. తెలంగాణ విడిపోవాలనే కోరిక కాదిది, కోస్తా రాయలసీమలు విడిపోయి, పక్కకుపోయి తమ రాజధానిని ఏర్పాటు చేసుకొమ్మని కోరడం. ప్రత్యేక రాష్ట్రం కోరడం లేదు వీళ్ళు, మీరు మా రాష్ట్రం వదిలి మా రాజధానిని వదిలిపెట్టి మీ చావు మీరు చావండి అంటున్నారు. పైగా సోదర ప్రేమట -ఉత్త డబ్బా!
కోస్తా, సీమల అభివృద్ధితో తెలంగాణ అభివృద్ధిని పోల్చేటపుడు, తెలంగాణా మైనస్ హైదరాబాదు చూడాలట. రాష్ట్రం ఏర్పాటయ్యేటపుడు మాత్రం ++హైదరాబాదు! ఉత్త అవకాశవాదం!
పైగా కుహనా సమైక్య వాదమని అవతలి వాళ్ళను అనడం!
చదువరి గారూ!
వాదన వేర్పాటువాదులు, సమైక్యవాదుల మధ్యనా? తెలంగాణ, ఆంధ్ర ప్రాంతీయుల మధ్యనా? మొత్తం తెలంగాణ వారితో వైరమైతే మరి సమైక్యత ఎవరితో? తెలంగాణ ప్రాంతీయులందరినీ టార్గెట్ చేస్తూ - "సోదర" బాధ అవతలాడికెందుకుండాలంట? - అన్నప్పుడే "కుహనా సమైక్య వాదం" మరొకమారు బయటపడింది. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక ముందు అది ఏ ఏ రాష్ట్రాలుగా ఉండేది, వాటికి ఏ ఏ నగరాలు రాజధానులుగా ఉండేవి - అన్న ఆలోచన ఉంటే ఇలా అనవసరంగా ఆక్రోశం వెళ్ళగక్కరు. తెలంగాణ రాష్ట్రం కోరుకొనేవారు అందుకు కారణాలను ఎనిమిదేళ్ళుగా సవిస్తరంగా వివరిస్తూనే ఉన్నారు.విని అర్థం చేసుకొనే హృదయం ఉందా? లేదా? అన్నది ప్రశ్న! ఒకసారి రాష్ట్రం విడిపోవడమంటూ జరిగితే, ఏర్పడక ముందు ఉన్న యథాస్థితిని కోరుకోవడంలో వింతేమీ లేదు. దానికి అప్పుడేదో తీసుకొనివచ్చి, ఇప్పుడేదో కోల్పోతున్నట్టు బాధపడవలసిన అవసరమేముంది? ఇక హైదరాబాదు అభివృద్ధి సంగతి - ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక ముందు కూడ హైదరాబాదు దేశంలో ఐదవ పెద్ద నగరం. ఈ యాభయ్యేళ్ళలో మద్రాసు, బొంబాయి, ఢిల్లీ నగరాలు ఎలా అభివృద్ధి చెందాయో, ఇదీ అదే నిష్పత్తిలో అభివృద్ధి చెందింది. అంతకన్న పెద్దగా ఏం ఒరగబెట్టారని? ఈ రోజు చెన్నైలో నలభై శాతం మంది తెలుగువాళ్ళున్నారు. వాళ్ళు మనవాళ్ళు కారా? కర్ణాటకలో ఎంతో మంది తెలుగువాళ్ళున్నారు. వాళ్ళు మన వాళ్ళు కారా? ఢిల్లీలో ఎందరో ఉన్నారు. అమెరికాలో ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నారు. వాళ్ళంతా మనవాళ్ళు కారా? ప్రాంతాలుగా కలిసుండడం కాదు. మనసులతో కలిసుండాలని గ్రహించండి.