The HEROES will RISE again...!





"...ఈ రోజు మనమంతా మన జాతీయ పతాకం సాక్షిగా స్వాతంత్ర్య పోరాటపు ప్రతిజ్ఙని స్వీకరిస్తునాం. ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఈ పతాకాన్ని మనం ఎర్రకోటలోనే ఎగరేసి వందనం చేస్తాంకానీ జ్ఙాపకం ఉంచుకోండి. మనం ఈ స్వాతంత్ర్యాన్ని మూల్యం చెల్లించి సాధించుకోవాల్సి ఉంది. స్వాతంత్ర్యం ఏనాడూ యాచన వలన సిద్దించదు. దాన్ని బలప్రయోగం ద్వారా సాధించుకోవాలి. దాని మూల్యం రక్తం
మనం మన స్వాతంత్ర్యం కోసం, ఏ విదేశీశక్తి ముందూ యాచన చేయబోవడం లేదు. మనం స్వాతంత్ర్యానికి అవసరమైన మూల్యాన్ని చెల్లించి మరీ సాధిస్తాం. అది ఎంత మూల్యమైనా సరే. భారతదేశానికి మనమంతా కలిసి కదం తొక్కుతూ కదలి వెళ్లేసమయంలో నేను కచ్చితంగా మన సేనని ముందుండి నడిపిస్తానని హామీ ఇస్తున్నాను...".

సుభాష్ జూ 1942 లోబెర్లిన్ లో చేసిన ప్రసంగం ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుల నరనరానా వేడి నెత్తురు పరువులెత్తించింది.ఇదే ప్రసంగ పాఠం తరువాత ఆజాద్ హింద్ రేడియో ద్వారా ప్రసారమైంది.


అయితే సుభాష్ బోస్ జర్మనీ వెళ్లింది అక్కడ తక్షణమే ఒక సైన్యాన్ని తయారు చేసి సైన్యంతో బ్రిటీష్ వారి మీద యుద్దంప్రకటించాలనే లక్ష్యంతో కాదునిజానికి భారత దేశ స్వాతంత్ర్యం కోసం విదేశీ గడ్డమీద భారతీయులతో ఒక పూర్తిస్థాయి సైన్యాన్నినిర్మించాలని సుభాష్ బోస్ నిర్ణయించుకునే ముందు చాలా కథ నడిచింది కథేంటో ముందు చూద్దాం.

Posted in |

0 comments: