తోడు దొంగలు



నిన్న ఒకే సంఘటన పైన ఈనాడు, సాక్షి పేపర్లు రెండూ విభిన్న కధనాలు ప్రచురించాయి. ఆరోపణలు 'బాబు' మీద కదా అని సాక్షి వాడు రెండో పేజీలో రాస్తే, అమ్మో ఇది మన వాడి వార్త కదా అని ఈనాడు ఎక్కడో మధ్యలో దూర్చింది.








విషయం: చంద్ర బాబు హెరిటేజ్ 
ఫుడ్స్ పైన వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని ఓ నలుగురు మంత్రులు కలసి డిమాండ్ చేస్తూ పెట్టిన ప్రెస్ మీట్ అది. ఒక విలేకరి వేసిన ప్రశ్నను వీరిరువురి పేపర్లలో వచ్చిన కధనాలు ఈ పైన ఉన్న ఇమేజిలను క్లిక్ చేసి చూడండి.

ఈ పారికి మీకు విషయం అర్థం అయిపోయి వుంటుంది. అస్సలు విషయం ఏమిటంటే తమ దగ్గర ఆధారాలు ఉన్నా ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదు ప్రభుత్వం. దివాకర రెడ్డి ఐతే ఏకంగా "విచారణ జరిపించాలి అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న" అని అన్నాడు. కాస్తంత మతి చేలించినట్లు ఉంది. తాను కూడా ప్రభుత్వంలో భాగమే అని మరిచిపోయినట్లున్నాడు.

ఇంత హడావుడి చేసి ఎవడూ ఏ చర్యా అదేసించలేదు. మరి విషయాన్ని కావాలనే తుంగలో తొక్కడానికే కదా. వీళ్ళు ఒక వేళ విచారణకు ఆదేశించినా ఈ లోపు తల తోకగా తోక తలగా మారిపోతుంది. ఇలా వాళ్లు వీళ్ళు దేశాన్ని దోచుకుంటారు. జనంలో మాత్రం హడావుడి చేయడానికి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉంటారు. మనం బకరాలం.

Posted in |

1 comments:

  1. సూర్యుడు Says:

    సూక్ష్మం గ్రహించారు ;)