చంద్రబాబు చెప్పేశాడు..!!
Posted On Saturday, July 4, 2009 at at 6:26 AM by MOVIEచంద్రబాబు చెప్పేశాడు. ఎన్నికల ఫలితాల రోజున మాట ఇచ్చినట్లుగా సరయిన విశ్లేషణ చేసుకుని తాము ఓడిపోవడానికి "నిజమయిన" కారణాలను బయటపెట్టాడు.1. తమ పార్టీ ఓడిపోవడానికి జనానికి తన మీద నమ్మకం లేకపోవడం కాదట. ఎలక్ట్రానిక్ వోటింగు యంత్రాలాట. 2. తామూ ఓడిపోవడానికి మరొక కారణం జనం తమకు వోటు వేయకపోవడం కాదట. వేరే పార్టీలకు వోటు వేయడమట. ఆహా!! టెక్నాలజీని ఆహా ఓహో అన్న రీతిలో ప్రోత్సహించిన నాయుడుబాబు ఈ రోజు ఓడిపోయిన తరుణంలో అదే టెక్నాలజీకి వీపు చూపించాడు. ఇంకా నయం. జనం వోటు వేయకపోవడానికి తాము మాట ఇచ్చిన రెండు వేల రూపాయలు చాలవనే ఉద్దేశ్యంతో అని చెప్పలేదు. ఈ కార్యక్రమంలో కొసమెరుపు మరలా బాబాయి-అబ్బాయిల ద్వయం చెప్పిన సినిమా డవిలాగులు (పార్టీ కోసం ప్రాణాలయినా ఇస్తాను, వగైరాలు...)