బ్యాంక్ ఉద్యోగాల పై నిరుద్యోగుల ఆశలు
Posted On Saturday, July 4, 2009 at at 9:45 AM by MOVIEఇప్పుడు నిరుద్యోగుల ఆశలు బ్యాంక్ ఉద్యోగాల వైపు మరలినాయి. అది కూడా ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగాల వైపు. ఈ మధ్య నాతో ఒక నిరుద్యోగి తాను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టినట్టు చెప్పాడు. బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయ బ్యాంకా, ప్రైవేట్ బ్యాంకా అని అడిగాను. జాతీయ బ్యాంకే అని చెప్పాడు. ప్రైవేట్ సంస్థల కంటే ప్రభుత్వ రంగ సంస్థలలోనే ఉద్యోగ భద్రత ఎక్కువ ఉంటుందని, అందుకే తాను పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టినట్టు చెప్పాడు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల ఐ.టి. రంగం దివాలా తీసింది. ఇప్పుడు కొంత మంది ఇంజినీరింగ్ విధ్యార్థులు కూడా బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కొన్ని జాతీయ బ్యాంకులకి గ్రామీణ ప్రాంతాలలో కూడా శాఖలు ఎక్కువ ఉండడం వల్ల గతంలో గ్రామీణ నిరుద్యోగులు బ్యాంక్ ఉద్యోగాల పై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు పట్టణ ప్రాంత నిరుద్యోగులు కూడా బ్యాంక్ ఉద్