ఆసక్తిని రేకెత్తిస్తున్న మగధీర పబ్లిసిటీ పోస్టర్లు .
Posted On Saturday, July 4, 2009 at at 5:50 AM by MOVIEఆడియో స్లో పాయిజన్‌లా ఎక్కుతుండడంతోపాటు, మగధీర పబ్లిసిటీ పోస్టర్లు విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రామ్‌చరణ్‌తేజ్ ద్వితీయ చిత్రంగా వస్తున్న ‘మగధీర’ జూలై ద్వితీయార్ధంలో విడుదలయ్యేందుకు యుద్ధప్రాతిపదికన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆడియోను అంగరంగ వైభవంగా మెగాభిమానుల సమక్షంలో విడుదల చేసిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, ఈ చిత్రాన్ని అత్యంత భారీగా, అత్యధిక ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సంసిద్ధులవుతున్నారు.