అల్లు అర్జున్ తల్లిగా వెటరన్ నటి
Posted On Thursday, July 2, 2009 at at 10:31 AM by MOVIEసుహాసిని తాజాగా అల్లు అర్జున్ తల్లిగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా పతాకంపై గుణశేఖర్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో సుహాసిని పాత్రకు మంచి ప్రాధ్యాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఆసక్తికరంగా ఇదే చిత్రంలో సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ తొలిసారి ఓ పూర్తి నిడివి పాత్రను పోషిస్తున్నారు.దాదాపు 79 సంవత్సరాల వయస్సు ఉన్న సింగీతం ఇప్పటికీ ఘటోత్కచ వంటి యానిమేషన్ చిత్రాలను రూపొందింస్తూ యువ దర్శకులకు పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక అంతకుముందు కూడా సింగీతం కొన్ని చిత్రాల్లో గెస్ట్ పాత్రలు చేసారు. కానీ పూర్తి స్దాయి పాత్రను చేయటం మాత్రం ఇదే మొదటసారి. ఐదు రోజుల పాటు జరిగే వివాహం నేపద్యంలో జరిగే ఈ చిత్రం భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతోందని సమాచారం