స్వలింగ సంపర్కుల
Posted On Saturday, July 4, 2009 at at 9:20 AM by MOVIE3: స్వలింగ సంపర్కులపై (గే)ల హక్కులపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంప్రదాయ భారత సమాజంలో అనేక కొత్త న్యాయ సమస్యలను ఆవిష్కరిస్తోంది. పదేళ్ళ సుదీర్ఘ పోరాటంతో గేలు తమ చర్య చట్టబద్ధమైందేనని తీర్పు పొందగలిగారు. ఇప్పటికే 126 దేశాలు వీరి చర్యలను ఆమోదిస్తూ చట్టాలు చేశాయి. ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ఈ దేశాల జాబితాలో భారత్ కూడా చేరినట్లయింది. కొన్ని పరిస్థితుల్లో వయోజనులకు మాత్రమే దీన్ని పరిమితం చేస్తూ చట్టం చేస్తే తప్పులేదని న్యాయస్థానం భావించింది. దీన్ని అత్యున్నత పార్లమెంట్‌లో చర్చించి చట్టం చేయాలని సూచించింది.
ఈ చర్య కొన్ని పాశ్చాత్య ఐరోపా దేశాల్లో ఆమోదయోగ్యం అయినప్పటికీ పటిష్ఠవంతమైన కుటుంబ వ్యవస్థ, స్త్రీ పురుష అనుబంధాలు, మానవసంబంధాలు ఉన్న భారతదేశంలో ఇలాంటి ప్రకృతి విరుద్ధ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం తగదని సంప్రదాయవాదులు భావిస్తున్నారు. ఈదేశంలో ఎంతటి వయోవృద్ధులైనా కుటుంబంతో కలసి సహజీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వికృత చేష్టలను హైందవ సమాజానికి అన్వయించడం తగదంటూ సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అన్ని మతాలకు చెందిన పెద్దలు కూడా ఈ చర్యను ఆమోదించలేక పోతున్నారు.
అయితే మరో వర్గం వాదన ఇందుకు విరుద్ధంగా ఉంది. పెరుగుతున్న నాగరికత, ఒంటరిగా జీవనం గడుపుతున్న పరిస్థితులు, సినిమా టివిల ద్వారా వయోవృద్ధుల్లో కూడా పెరుగుతున్న కామవాంఛలు సమాజంలో అనేక దారుణాలకు ఆస్కారం కల్పిస్తున్నాయి. వృద్ధులు కూడా పసిపిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మహిళలపై యాసిడ్ దాడులు, అత్యాచారాలు తగ్గాలంటే గే సంస్కృతిని చట్టబద్ధం
చేయాలని వీరు భావిస్తున్నారు. వికటిస్తున్న సెక్స్ ప్రభావానికి అమాయకులు బలికాకుండా ఉండాలంటే ఈ చట్టం ఉపకరిస్తుందని, మహిళలపై దాడులు తగ్గుముఖం పడతాయని పేర్కొంటున్నారు. అయితే ఛాందసవాదులు మాత్రం పాశ్చాత్య దేశాల్లో సరైన కుటుంబ వ్యవస్థ లేని పరిస్థితుల్లో ఇలాంటి వికృత చర్యలకు ఆస్కారం ఏర్పడిందని వాదిస్తున్నారు. కుటుంబ వ్యవస్థ క్షీణించడం, ఒంటరి జీవితాలకు అలవాటుపడ్డం వల్ల వయోవృద్దులు జీవితంలో సంతోషాన్ని, ప్రసాంతతను పొందలేక పోతున్నారని, ఇలాంటి వారంతా గే సంస్కృతికి అలవాటు పడుతున్నారని చెబుతున్నారు. స్వలింగసంపర్కానికి చట్టబద్ధత కల్పిస్తే యువత మాదకద్రవ్యాలకు కూడా అలవాటు పడే ప్రమాదం నెలకొంది. వారి జీవితంలో మానసిక దౌర్బల్యం నెలకొంటొంది. ఆత్మన్యూనతాభావం పెరుగుతుంది. ఇవన్నీ ఆత్మహత్యలకు దారితీస్తాయి. అంతేగాక తాము సహజీవనం చేసిన హోమో భాగస్వామికి చెందిన ఆస్తులపై కూడా హక్కు కోసం పోరాడే అవకాలుంటాయి. సహజీవనం చేసినందున తనకు ఆస్తిలో భాగస్వామ్యం కల్పించాలన్న డిమాండ్ భాగస్వాముల నుంచి ఏర్పడనుంది. ఇవి మరికొన్ని కొత్త న్యాయ సమస్యలు సృష్టించనున్నాయి. ఆస్తి హక్కుపై కొత్తచట్టాలు చేయాల్సి ఉంది. భారతదేశంలో ఒక అంచనా మేరకు 0.80 శాతం మంది హోమోసెక్స్‌వల్స్ ఉన్నట్లు గుర్తించారు. ఒక ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 40 వేల మంది 'గే'లు, 30 వేల మంది లెస్బియన్‌లు ఉన్నట్లు అంచనాకొచ్చారు. కొంతకాలం కిందట మూతబడ్డ ఒక ఇంగ్లీషు వీక్లీకి ఎడిటర్‌గా వ్యవహరించిన ఆశోక్‌రావ్ కవి దేశంలో ఈ హోమో ఉద్యమాన్ని మలుపు తిప్పారు. మూడేళ్ళ క్రితం ఆయన హైదరాబాద్‌లో రహస్యంగా జాతీయ స్థాయి హోమోల సమావేశాన్ని కూడా నిర్వహించారు. అతితక్కువ సంఖ్యలో ఉన్న వీరికోసం పార్లమెంట్ చర్చించి చట్టాలు చేయాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు.
గే సెక్స్ తీర్పుపై వెబ్‌లో దుమారం
న్యూఢిల్లిd, జులై 3: స్వలింగ సంపర్కం చట్టబద్దమేనని ఢిల్లిd హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భారత సమాజం రెండుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. నెటిజన్లు రెండుగా విడిపోయి కత్తులు దూసుకుం టున్నారు. ఢిల్లిd హైకోర్టు తీర్పును కొంత మంది గొప్ప తీర్పుగా అభిర్ణిస్తుండగా, మరికొంత మంది స్వలింగ సంపర్కం అసహజ మనదనీ భారత సంస్కృతికి విరుద్ధమైందని వాదిస్తున్నారు. బ్లాగ్స్‌లోనూ మీడియా వెబ్‌సైట్లల ోనూ గే సెక్స్‌పై వ్యాఖ్యల దుమారం చెలరేగుతోంది. తీర్పు లైంగిక తారతమ్యాన్ని తోసిరా జంటూ వ్యక్తులకు గౌరవం తెచ్చిపెడు తోందని మహారాష్ట్రలోని థానేకు చెందిన ఒక వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, అతను లేదా ఆమె తన ఇష్టానికి అనుకూలంగా జీవించ గలుగుతారని మరొకరు అన్నారు. గే జంటకు ఆలస్యంగా చట్టబద్ధత కల్పించారని, ప్రపంచ వ్యాప్తంగా గేలను అంగీకరిస్తున్నారని, అటువంట ప్పుడు భారత్‌లో అంగీకరించడానికి అభ్యంతర మేమిటని అనేవారు కూడా ఉన్నారు.
'హోమో' తీర్పుపై ప్రధాని పరిశీలన
న్యూఢిల్లిd, జులై 3: గే సెక్స్‌పై ఢిల్లిd హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సంబంధిత చట్టాన్ని మార్చాలా, వద్దా అనే విషయాన్ని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పరిశీలిస్తున్నారు. హోం మంత్రి పి. చిదంబరం, న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ, ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ శుక్రవారం సమావేశమై ఢిల్లిd హైకోర్టు తీర్పుపై విస్తృత చర్చలు జరిపారు. తమ ముగ్గురం ప్రధానికి ఒక నివేదిక సమర్పిస్తామని సమావేశానంతరం మొయిలీ విలేకరులకు చెప్పారు. తీర్పును విశ్లేషించామని, నివేదికను ప్రధానికి ఇస్తామని ఆయన అన్నారు. తమ ముగ్గురు మంత్రులు సమావేశమై ఒక అభిప్రాయానికి రావాలని ప్రధాని తమకు సూచించినట్లు ఆయన తెలిపారు.