మౌనం *


అందమైన అడవి ,అందులో స్వామీ మౌనానందుల వారి ఆశ్రమం. ప్రశాంతమైన ఆవరణ
లోకి అడుగు పెట్టాడు హర్ష .

వృద్ధస్వామి,అతన్ని లోపలికి తీసుకెళ్ళారు,ఆశ్రమ విశేషాలను,విధి విధానాలను వివరించారు .

హర్ష అన్నీ శ్రద్ధ గా విని ,ఆశ్రమంలో ఉండిపోవాలన్న కోరిక వ్యక్తం చేసాడు. దానికి వృద్ధస్వామి
సరేనంటూ , ఉన్నంత కాలం మౌనం గా ఉండాలని , అనుమతి ఇస్తే తప్ప మాట్లాడ కూడదని
చెప్పారు .

హర్ష , హర్షానంద అయ్యాడు .ఆశ్రమం లో రెండేళ్ళు దీక్ష గా గడిచాయి.అప్పుడు రెండు పదాలు
మాట్లాడ టానికి అనుమతి లభించింది .

హర్షానంద చెప్పారు "భోజనం బాలేదు ".తరువాత నుండి చక్కని భోజనం ఏర్పాటు చేయబడింది.

మరో రెండేళ్ళు గడిచాయి , మరో రెండు పదాలు మాట్లాడటానికి అనుమతి లభించింది .

సారి హర్షానంద అన్నారు "పడక ఇబ్బంది ". తరువాత మంచి పడక ఏర్పడింది .

ఆరేళ్ళు పూర్తి అయినాయి .పెద్దల అనుమతి తో రెండు పదాలు పలికారు హర్షానంద ,

"ఆశ్రమం వదిలేస్తున్నాను "

విన్న వృద్ధ స్వామి చెప్పారు ,

" నువ్వు పని ఎప్పుడో చేయవలసింది . వచ్చినప్పటి నుండీ నీ ఇబ్బందుల గురించి
చెప్పటం తప్ప , సాధించింది ఏమీ లేదు.శుభం , వెళ్లిరా నాయనా "

Posted in |

0 comments: