బినీ బేబీస్
Posted On Saturday, July 4, 2009 at at 9:32 AM by MOVIEబినీ బెబీస్
సమ్మర్ సెలవులు అనెసరికి పిల్లలకి కాలక్షెపం కొసంకొసం బొలెడు ప్రొగ్రాములు అనౌన్స్ చెస్తారు,ఫలానాచొట ఫలాన రొజు,ఫలానా టైముకి,ఫలాన పొటీ పిల్లలకి జరుగుతుంది మీ పిల్లలని
తీసుకురావాలంటె రిజిస్టెర్ చెయ్యండి అంటారు. అన్నిటికి మన కంప్యూటర్ మామయ్య వున్నాదుగా,ఆయనకి చెపుతె చెసెస్తాడు."శహనాకి ఇవాళ ""బినీ బెబీస్ "ప్రొగ్రాం వుంది దొడ్డా వెళ్దాము అంది రాధిక.పిల్లని తీసుకువెళ్ళాము. మిల్ వాలీ పబ్లిక్ లైబ్రరీ లొ చిల్డ్రెన్స్ రూంలొ జరిగింది.పిల్లలకొసం కెటాయించిన స్థలం,కొన్ని రూములొనూ కొన్ని వాతావరణం బాగుంటె ఆరు బయట చెస్తారు.బినీబెబీస్ ఆరుబయత చెసారు.సంఫ్రంచిస్చొ లొ రొడ్లన్ని ఎత్తులు పల్లాలు.మెలికలు.ఈ లైబ్రరీ కొండ
మీద చెట్ల మధ్య వుంది.బాగా ఎత్తుగా పైన గుబురుగా వుండె చెట్లు ఒకచొట గుంపుగా పదిమంది నులుచుని తలలు దగ్గర పెట్టి ఎదొ సమస్యని చర్చిస్తున్నట్లుగా వున్నాయి.వాటి నీడ ఇంటికప్పులా చల్లగా వుంది.అక్కడొక రాతి తిన్నెవుంది.అక్కడ జరిగింది. పక్కనె చిన్న సెలయెరు ఉషారుగా పరుగెత్తుతున్నది. మెము వెళ్ళెసరికి ప్రొగ్రాము నడిపె ఆవిడ సామాను తొ సహా సిధ్ధంగా వుంది.రెండున్నర ఎళ్ళ వయసు పిల్లల్ని కూడా తల్లులు తీసుకు వచ్చారు.అందరూ చెరాక పిల్లల్ని గుండ్రంగా కూర్చొ పెట్టి తల్లలు, వెంట వచ్చిన వాళ్ళు వాళ్ళ వెనకె కూర్చున్నారు.అందరూమట్టి నెల మీదే కూర్చున్నారు.ఆ చెట్ల నీడ మధ్య రెండుమూడు సూర్య కిరణాలు "ఎంచెస్తున్నారో? చూద్దాము అన్నట్లుగా దూసుకు వచ్చాయి.
ఒకామె బొమ్మల పుస్తకం తెచ్చి కధ చెప్పింది. చెట్లు కావాలంటె నెల బాగుచెసి,ఎరువు వెయాలి,గింజ నాటాలి,నీరుపొయాలి అని చూపించి చెప్పింది.తరువాత అందరికి టెర్రకొట
కుండీలు బుల్లివి ఇచ్చారు.వాటిమీద రంగులతొ డిజైన్స్ వెయ్యడానికి రంగు పెన్సిల్స్ ఇచ్చారు,అంటైంచ డానికి ఒక స్టిక్కెర్ ఇచ్చారు. పిల్లలు గబగబా రంగులు పూసెసారు,వాల్ల పెర్లు కుండీపై వ్రాయమన్నారు, వ్రాసెసారు.పిల్లలు పెయింట్ చెస్తూంటె తల్లులు ఆనంద పడిపొయారు,పిల్లలకి గర్వం చెసామని. తరువాత పిల్లలందరిని పొట్స్ తీసుకొని లైనుగా నిలబడమన్నారు.బుధ్ధిగా నుంచున్నారు.అప్పుదు వాళ్ళ కుండీలలొ ఒకావిడ మట్టిపొసింది,వాళ్ళెతెచ్చారు.మరో ఆవిడ బీన్స్ గింజ దానిలొ నాటింది,మరొ ఆవిడ నీళ్ళు పొసింది..ప్రింట్ చెసిన కార్డ్ ఒకటి ఇచ్చారు,దానిపై"చెట్లుపెంచాలంటెకొంచెం మట్టి,ఒక గింజ,కాసిని నీళ్ళు,కాస్త ఎండ,కాస్త ప్రెమ కావాలని వ్రాసారు.
ఇది అయిపొగానె పిల్ల లందరూ పొలో మంటూ నీళ్ళ దగ్గరికి పరుగ్ర్తారు,తల్లులు కాసెపు నీళ్ళతొ ఆడాక పక్కనున్న లైబ్రరీకి వెళ్ళాము.పెద్దపెద్ద అద్దాల కిటికీలున్న హాలుల్లొ లైబ్రరీ విసాలంగావుంది.బయటికి చూస్తె అందమైన ప్రక్రుతి.నిస్సబ్దం.అందరూ లాప్ తాప్లు తెచ్చుకొని కాఫీతాగుతూ చదువు కొంటున్నారు.లెఖ్ఖ లెనన్ని పుస్తకాలు.చిన్న జీవితం.జన్మంతా వెచ్చించినా
వాటి పేర్లుకూడా చదవలెమోమో?అనిపించింది.పిల్లలు తయారు చెసిన బొమ్మలతొ ఆవిభాగం అంతా అలంకరించారు.లైబ్రరీ వాళ్ళు బూక్ మార్కెలు ప్రింట్ చెసెందుకు బొమ్మలకొసం పిల్లలకి పొటీ పెద్తారట. ఫష్ట్ వచ్చిన వారి బొమ్మ తీసుకు చార్డ్ తయారు చెసి బొమ్మ వెసిన వారి పెరు,వయస్సు
వెస్తారు.ఇలాటివి ఎంతొ ప్రొత్సాహాన్నిస్తాయి.
రాధిక వాళ్ళతొ మెము ఇండియా వెల్తున్నాము వచ్చాక కలుస్తామని చెప్పింది. వాళ్ళు సహనాకి
ఒక తెల్లకాగితాల బూక్,పెంచిల్ ఇచ్చారు,అక్కడి విషెషాలు వ్రాయమని చెప్పారు.వాళ్ళకి ఉత్తరాలు వ్రాయమని కవర్లు,కాగితాలు,స్టాంపులు ఇచ్చారు.ఒకషీటుపై లైన్లు వెసివున్నాయి.రొజు 20 నిముషాలు పుస్తకం చదవాలి,చదివి అందులొ నొతె చెయ్యాలి. ఆకడినుంచి వ్రాసిన ఉత్తరాలు బాగుంటె లైబ్రరీలొ డిస్ప్లె చెస్తారట.చిన్నపిల్లల విభాగంలొ కూడా పెద్ద డిక్ష్నరీలు ఉన్నాయి,పిల్లకి వెరె వున్నాయి.పుస్తకాలు,డ్వ్డ్లు ఇంటికి ఇస్తారు,ఫ్రీగా.పిల్లలు పుస్తాకాలు చదివె అలవాటు పెంచడానికి తల్లులు కూడా శ్రమ్ పడతారు.చిన్నపిల్లల్ని తీసుకు వచి పుస్తకాలు చదివి వినిపిస్తారు. చక్కటి వాతావరణంలొ అక్కడకూర్చుని పుస్తకాలు చదువుకొవాలనిపించింది.