ఒక(రోశయ్య) దెబ్బకు రెండు పిట్టలు(చిరంజీవి, చంద్రబాబు)

రోశయ్య గారిలో ఎవరినీ నొప్పించని మంచి హాస్యం వుంది. ఇద్దరు ప్రత్యర్దులు చిరంజీవి, చంద్రబాబులను ఎలా కొట్టారో మీరే చదవండి. ‘పొగడ్త’ అనే మెత్తని కత్తితో చిరుని, చిరు అనే ఆయుధం తో చంద్రబాబును పొడిచిన ఆయన తీరును మెచ్చుకోకుండా వుండలేము.

YS Rosayya

తెలుగుదేశం పార్టీలో తిరుగుబాట్లకు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ కారణమని ఆరోపిస్తున్న చంద్రబాబు నాయుడికి మతి తప్పినట్లు కనిపిస్తోందని మంత్రి కె రోశయ్య వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఎన్నికల అనంతరం బయటపడుతుంటే వాస్తవాలను గుర్తించకుండా చంద్రబాబు సంయమనం కోల్పోయి ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు. గురువారం మీడియా సమావేశంలో రోశయ్య మాట్లాడారు. తెరాస, తెలుగుదేశం పార్టీల పరిస్థితి దయనీయంగా మారిందని, దాంతో ఆ పార్టీల అధినేతలు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ పార్టీల్లో విభేదాలను పెంచి పోషించే అవసరం కాంగ్రెస్ పార్టీకి గాని, ముఖ్యమంత్రి వైఎస్ గాని లేదని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలిచిన పార్టీని అంగీకరించే కనీస జ్ఞానాన్ని కూడా ఆ నాయకులు కొల్పోయారని ఆయన విమర్శించారు. కొత్తగా పార్టీ పెట్టిన చిరంజీవిని చూసైనా ఈ నాయకులు నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఎవరు బయటకు పోయినా,చివరకు తాను వెళ్ళిపోయినా ప్రజారాజ్యం ఉంటుందని రాజకీయాలకు కొత్త అయినా చిరంజీవి చేసిన ప్రకటన చూసి ఈ నాయకులు నేర్చుకోవాలని, రాజకీయాలలో అలాంటి పరిణితి అవసరమని ఆయన అన్నారు.

Posted in |

0 comments: