కాంగ్రెస్ వారికి ఎలా ఉందొ తెలియదు కానీ నాకు మాత్రం మింగుడు పడడంలేదు. నా దృష్టిలో మన రాష్ట్ర యంపిలు పేపర్లకి ఎక్కడం, మీడియాకి ఇంటర్వియూలు ఇచ్చి తమ గోడు వెల్లబోసుకోవడం సుద్ధ దండగ.
Posted On Saturday, July 4, 2009 at at 6:24 AM by MOVIE
ఆరుగురు యంపిలను పంపిన కర్నాటకకు నాలుగు మంత్రి పదవులు, 16 మంది యంపిలను పంపిన కేరళకు 6 మంత్రి పదవులు, 21 మంది ఉన్న ఉత్తరప్రదేశ్ కు 5 మంత్రి పదవులు. ఇలా పోతా ఉంటే ప్రతీ రాష్ట్రం కంటే మనమే వెనుక బడి ఉన్నాం. మన వారు చేసిన పాపం ఏంటి. మిగిలిన రాష్ట్రాలు చేసిన పుణ్యం ఏంటి.
దాదాపుగా ఒంటి చేత్తో రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి పట్టాభిషేకాన్ని చేసిన ఆంద్ర రాష్ట్ర ప్రజలు "కూరలో కరివేపాకులా". ఇంతా చేసిన ఇవేళ మన్మోహన్ సింగ్ "ప్రతిభ వంటి అంశాలను పరిగణలోకితీసుకున్నాం" అని తెలియజేసారు. మన యంపిలలో లేని ప్రతిభ వరుస కరువులతో బాధపడుతున్న మహారష్ట్రకి ఒక్క సరయిన పరిష్కారాన్ని చూపలేకపోయిన , కరవు పీడిత ప్రజలకు కనీస ఓదార్పుగా కూడా ఉండలేకపోయిన "విలాసరావ్ దేశ్ముఖ్" వంటి వారిలో ఏముందో.
ఇది కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తలదించుకోవలసిన చర్య. తమను అభిమానించి తమ పనితనాన్ని మెచ్చుకున్న రాష్ట్ర ప్రజలను తడిగుడ్డతో గొంతు కోసి నవ్వులపాలు చేసారు.
ఇంతా జరిగితే జాతీయ మీడియా మాత్రం తమ చెత్త బుద్ధి పోనిచ్చుకోలేదు. ప్రధాని, సోనియా, రాహుల్ లను పదే పదే "ఉత్తరప్రదేశ్ కి ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్నారు". కళ్ళకు గంతలు కట్టుకుని ఉత్తరభారతం మాత్రమే ప్రపంచం అనుకుంటున్నారు ఎప్పటిలానే.
ఇంతా చేసి తన కాబినెట్ పని పూర్తి అవ్వగానే తనకు ఇంకేం సబంధం లేదు అని చేతులు దులుపుకుంటూ జెరూసలెం వెళ్లిపోయారు మన ముఖ్యమంత్రి. బావుంది. చాల బావుంది.