ధొని చెత్త కెప్టెన్సి

టీం ఇండియా నిష్కృమణ టీం ఇండియా పేలవ ప్రదర్శన తో 20-20వరల్డ్ కప్ నుంచి వైదొలిగింది టీం ఇండియా ఇంతటి చెత్త ప్రదర్శనకి కారణం అంతర్గత విబేధాలేన. వరల్డ్ కప్ ప్రారంభం కాక ముందు నుంచే ధొనికి సెహ్వగ్ కి మద్య జరిగిన విబేదం కారణంగానే సెహ్వగ్ టోర్ని నుంచి నిష్కృమించాడు అనుకోవచ్చు ఏది ఎలా ఉన్నప్పటికి నిన్న మొన్న జరిగిన మ్యాచ్లలో ధొని నిర్ణయాల వల్లే ఓడిపోయాం అన్నది ఖచ్చితమైన నిజం. ఒత్తిడి సమయంలో అది ఈ మ్యాచ్ ఓడిపోతే వరల్డ్ కప్ నుంచే వైదొలుగుతాం అని తెలిసి సీనియర్ ఆటగాళ్ళని దించ కుండ 20-20 మ్యాచ్ లు పక్క దేశంలో ఎప్పుడు ఆడని రవీంద్ర జడేజా ని దించి పెద్ద పొరపాటే చేశాడు అటువంటీ ఒత్తిడిని తట్టుకోలేని జడేజా బాల్ టు బాల్ రన్ చేయటంలో విఫలమయి మిగతా బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి తెచ్చాడు దాని మూలంగానే యువరాజ్ ప్రతి బంతిని బౌండరి దాటించలనే తొందరలో ఔట్ అవల్సి వచ్చింది దీనికి తోడు తరువాత వచ్చిన ధొని తన సహజ సిద్దమైన ఆట ఆడకూండ షాట్లు కొట్టడంలో విఫలమయ్యడు యుసుఫ్ ఎంత ప్రయిత్నిచినప్పటికి ఫలితం లేకపోయింది ఇది అంత మ్యాచ్ గురించి అయితే ధొని గురించి వేరుగా ప్రస్తావించుకోవాలి అది ఏమిటంటే ప్రతి మ్యాచ్ గెలిస్తే అది ధొని కెప్టెన్సి వల్లే గెలిచిందంటు చెప్పే అందరు ఇప్పుడు ధొని పై ఈ ఓటమి భాద్యత కూడ ఉంచాలి నిన్న దాక గొడవ పడిన ధొని కి మ్యాచ్ అనంతరం సెహ్వగ్ లోటు తెలిసొచ్చింది మ్యాచ్ అనంతరం సెహ్వగ్ లోటు తీర్చలేనిదంటు చెప్పుకొచ్చాడు ఎప్పుడు పాసిటివ్ గా ఆలోచిస్తడనే ధొని ఇంగ్లండ్ తో మ్యాచ్ లో తన తప్పుడు నిర్ణయాలతో చేజేతుల మ్యాచ్ని ఇంగ్లాండ్ చేతులలో పెట్టాడు ధొని కిప్పుడు సీనియర్ ఆటగాళ్ళ విలువ తెలిసొచ్చి ఉంటుంది ఇప్పటిదాక తన వెనుకే ఉన్న లక్ ఇప్పుడు ఉంటూందో ఉండదో మరి

Posted in |

1 comments:

  1. హరే కృష్ణ . Says:

    హమ్మయ్య..అంతా సైలెంట్ గా వున్నారేమో అని నేను రాద్దమనుకున్నది మీరు రాసేసారు :)
    ధోని కెప్టెన్ గా కాకుండా ఒక ఆటగాడి గా కూడా విఫలమయ్యాడు వీక్ టీం ల పైన వన్ డౌన్ లో బ్యాటింగ్ కి వచ్చి నాకు తెలిసి బంగ్లాదేశ్ మీద కూడా ఓడేవాళ్ళం సరిన టైం లో యువరాజ్ వచ్చి కాపాడాడు వెస్ట్ ఇండీస్ మీద ఆ చెత్త బ్యాటింగ్ చూడలేక చిరాకు పెట్టించాడు మ్యాచ్ అయ్యాక నేను సరిన టైం లో అవుట్ అవ్వడం వల్లనే ఓడాము అని ఒక స్టేట్మెంట్ ,stumpings చెయ్యలేక
    జడేజా ఒక టెస్ట్ మ్యాచ్ ని డ్రా చెయ్యాలి అన్నట్టు ఆడాడు కదా
    ఇషాంత్ శర్మ కి అన్ని matches లో పెట్టి పర్తిఅల్లితి బాగా చూపించుకున్నాడు
    షార్ట్ బల్లలు ఆడలేని టీం ఇండియా అనే ఒక అపవాదు ని మోసుకొచ్చాడు
    సందేశం గారు.. మీ విశ్లేషణ బావుంది