"మనం-మనసంస్కృతి వివాహ భంధం" '
Posted On Tuesday, June 30, 2009 at at 12:43 AM by MOVIE- వివాహా మంత్రములు అర్దవంతముగా అర్దం తెలుసుకొని ఆచరించే సాంప్రదాయకమైన అత్యున్నత మానవ వావివరసలు-భందుత్వాలు చలోక్తులతో కూడిన సత్ ప్రవర్తనను-సంస్కృతిని బద్దంగా నడిచే విధానం తెలిపిన వేదములు ఈ ప్రపంచానికే ఆదర్శం.అంతే కాదు స్త్రీకి అత్యున్నత గౌరవం మరియు స్వేచ్చను ఆనాటి వారు ఇచ్చారు ఎలాగంటే ధర్మ,అర్ద,కామములలో స్త్రీ యొక్క అధికారం పూర్తిగా ఉంటుంది అంటే ధర్మమున ఈమెను దాటను డబ్బు ఖర్చు పెట్టే విషయంలోను దాటను సంతౄప్తితో సుఖములలో కూడ ఈమెను దాటను అనే ప్రతిజ్ణ వరునితో చేయిస్తారు.ఈ కన్యదానం సమయంలో కన్యదాత యొక్క పితౄ దేవతలు తరించడానికి వారి ఆనందం కోసం కన్యదాత బ్రహ్మలోక ప్రాప్తి కొరకు కనక ఆభరణాలతో కూడిన తన కూతురిని తనకు అల్లుడు కాబోయే వరునికి పరమేశ్వర సరూపాలైన పంచ భూతల సాక్షిని చేస్తు ఇస్తున్నాను అంటాడు వరుని సుశీలుడు అంటే మంచి గుణములు కలవానికి దుర్ఘుణములు లేనివానికి వెతికి మరి పెళ్ళి చేయాలి అని అంటుంది వేదం అ నవ వధువుతో ఆనందంగా ఐహిక సుఖలు తీర్చుకో మంటాడు సత్ సంతానస్న్ని కనమని చెపుతాడు కన్యదాత కాబట్టి.