హైదరాబాద్ బుక్ ట్రస్ట్ Hyderabad Book Trust
Posted On Saturday, July 4, 2009 at at 9:54 AM by MOVIEప్రాచీన భారతంలో ఆహారపు అ లవాట్లు - డి. ఎన్ ఝా ...పారడాక్స్ అఫ్ ది కౌ ....
ప్రాచీన భారతంలో ఆహారపు అ లవాట్లు
- డి. ఎన్ ఝా ...
మన దేశంలో ఆహారపు అ లవాట్లు ఎప్పుడూ ఒకేలా లేవు. కాలమాన పరిస్థితులను బట్టి, ప్రాంతాలను బట్టి, అవసరాలను బట్టి మారుతూ వచ్చాయి.
ఇప్పటికీ ఒక్కో ప్రాంతంలో ఒకో రకమైన ఆహారపు అ లవాట్లు కనిపిస్తాయి. పశ్చిమ బెంగాల్‌లో బ్రాహ్మణులు చేపలు తింటారు. చేపలను వాళ్లు ''జలపుష్పాలు''గా పరిగణిస్తారు. అంటే వాళ్ల దృష్టిలో చేపలంటే ఒకరకం సముద్రపు ఆకుకూర లాంటివన్నమాట. అయితే వాళ్లు కూడా ఇతర మాంసాహారం ముట్టుకోరు. కాశ్మీర్‌లో బ్రాహ్మణులు మరోరకం పాక్షిక మాంసాహారులు. అదేవిధంగా మనదేశంలో చాలా చోట్ల శాఖాహారులు కోడిగుడ్లను శాఖాహారంగా పరిగణించి స్వీకరించడం కనిపిస్తుంది.
ఈ నాడు ఆవు హిందువుల మత చిహ్నంగా మారిపోయింది. పరమ పవిత్రమైన జంతువుగా పూజలందుకుంటోంది. కానీ వేదకాలంలో, ఆతరువాత బ్రాహ్మణ, బ్రాహ్మణేతర సంప్రదాయాల్లో అంత పవిత్రమైనదిగా చూడబడలేదని, ఆకాలంలో ఇతర జంతువులలాగే ఆవులను యజ్ఞ యాగాల్లో బలియిచ్చేవారని, బ్రాహ్మణులు సైతం గోమాంసాన్ని ఆరగించేవారనీ ప్రాచీన గ్రంథాల ఆధారంగా సోదాహరణంగా వివరిస్తారు ప్రొఫెసర్ డి.ఎన్.ఝా.
గోసంరక్షణ ఆహ్వానించదగ్గదే ఆయినా అది శాస్త్రీయ పద్ధతిలో, దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరగాలి తప్ప పరమత ద్వేషంతోనో, మూఢనమ్మకాలతోనో కాదనీ, ఒక్క ఆవునే ఎందుకు మిగతా జంతువులను మాత్రం ఎందుకు రక్షించకూడదు అంటారాయన. ఆయన రాసిన Paradox of the Cow: Attitudes to Beef Eating in Early India పరిశోధనా గ్రంథం పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే చరిత్రను నిష్పాక్షికంగా పరిశోధించాలనే తప్ప ఇందులో ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదంటారాయన.
స్వయంగా శాఖాహారి అయిన ప్రొఫెసర్ ద్విజేంద్ర నారాయణ్ ఝా ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర బోధకులు. ఆయన సుదీర్ఘ పరిశోధనా పత్రంలోని కొంత భాగాన్ని ఈ చిరుపుస్తకంగా తెలుగులోకి తీసుకురావడం జరిగింది. అందులోంచి కొన్ని వ్యాఖ్యలు:
...గోమాంసం తినే అ లవాటు భారతదేశానికి విదేశాల నుంచి వలస వచ్చినవాళ్ల ద్వారా ముఖ్యంగా ముస్లింల ద్వారా మన దేశానికి సంక్రమించిందనీ, గోమాంస భక్షణని వాళ్లే మనదేశంలో ప్రవేశపెట్టారనీ కొందరు నమ్ముతారు. కానీ యజ్ఞయాగాల్లో గోవధ, గోమాంస భక్షణ అనేది మన దేశంలో చాలా ప్రాచీన కాలంనుంచే వుంది.
...పాకిస్థాన్‌లోని షిన్ తెగకు చెందిన ముస్లింలు ఇతర ముస్లింల మాదిరిగా పంది పట్ల ఎంత ఏహ్య వైఖరి కనబరుస్తారో ఆవు పట్ల కూడా అంతే ఏహ్య వైఖరి కనబరుస్తారు. వాళ్లు ఆవు మాంసాన్ని కూడా పంది మాంసంలాగే ఏవగించుకుంటారు.
...ప్రాచీన కాలపు హిందూ సాంప్రదాయం ప్రకారం గోమేథ లేదా అశ్వమేధ యాగాల్లో గోవును లేదా గుర్రాన్ని బలి ఇవ్వడం సర్వసాధారణమైన ఆచారంగా వుండేది.
...వేదాలలో మొత్తం 250 రకాల జంతువుల ప్రస్తావన వుంది. వాటిలో 50 రకాల జంతువులు పవిత్రమైన బలికి, మానవ వినియోగానికి అర్హమైనవిగా పేర్కొన్నారు. ''తైత్తరేయ బ్రాహ్మణం''లో వాస్తవానికి ఆవు మన ఆహారం (అథో అన్నం వాయ్ గోవః) అని చాలా స్పష్టంగా పేర్కొనబడింది. ''సుతపథ బ్రాహ్మణం''లో యజ్ఞవల్క్యుడు లేత ఆవు మాంసాన్ని కోరడం గురించిన ప్రస్తావన వుంది.
...ఋగ్వేద కాలంలో చనిపోయిన వ్యక్తి శవాన్ని కప్పేందుకు దళసరి ఆవు కొవ్వును ఉపయోగించేవారు. ఆ వ్యక్తి పరలోక యాత్రకు వాహనంగా ఉపయోగపడేందుకని శవంతో పాటు ఒక ఎద్దును కూడా దహనం చేసేవారు. ఉత్తర క్రియల్లో (దశదిన కర్మ) భాగంగా ఆవునో ఎద్దునో వధించి బ్రాహ్మణులకు విందు యిచ్చేవారు. ఆరోజు సమర్పించే జంతువుల స్థాయిని బట్టి పితృదేవతల సంతృప్తి ఆదారపడి వుంటుందని నమ్మేవారు. (ఋగ్వేదం X.14-18), అధర్వణ వేదం X 11.2, 48)
...మహా భారతంలోని అత్యధిక పాత్రలు మాంసాహారం తినేవే. రంతిదేవుని కథ ఇందుకు పరాకాష్ట. ప్రతిరోజూ ఆయన వంటగదిలో అనేక ఆవులను వధించి బ్రాహ్మణులకు ధాన్యంతో పాటు మాంసం పంచేవారు. రామాయణంలో ఆవుతో సహా వివిధ జంతువులను బలియివ్వడం, తిండి కోసం వధించడం గురించి వాల్మీకి అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు.
... యమునా నదిని దాటేటప్పుడు సీత ''రాముడు తన ప్రతిజ్ఞా పాలన పూర్తిచేసిన తరువాత 1000 ఆవులతో , 100 పీపాల మద్యంతో నిన్ను కొలుస్తాను తల్లీ'' అని మొక్కడం గమనించవచ్చు.
... సీతకు దుప్పి మాంసం అంటే చాలా ఇష్టం. అందుకే రాముడు లేడి రూపంలో వున్న మారీచుణ్ని వెంటాడి వేటాడి చంపుతాడు. అట్లాగే భరద్వాజుడు ఒక ఆవుదూడను వధించి రాముడిని ఆహ్వానించిన వైనం కూడా రామాయణంలో కనిపిస్తుంది.
... గౌతమ బుద్ధుడు, మహావీరుడు అహింసా సిదాంతాన్ని ప్రచారం చేశారు. వైదిక కాలపు జంతుబలిని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే బుద్ధుడు మాంసాహారాన్ని తినకూడదని చెప్పలేదు. బౌద్ధ మతస్థులకు మాంసాహారం ఆమోదయోగ్యమనేందుకు గ్రంథస్త ఆధారాలు అనేకం వున్నాయి.
... మధ్యయుగపు తొలి రోజుల నుంచే గోవధ, గోమాంస భక్షణ పాపకార్యంగా చూడబడుతోంది.
...హిందూ గో సంరక్షణ ఉద్యమాన్ని మొదలు పెట్టినప్పటి నుంచీ రాజకీయ జన సమీకరణకు ఆవు ఒక సాధనంగా మారింది. 1882లో మొట్టమొదటి గోరక్షిణి సభ ను స్థాపించి స్వామీ దయానంద సరస్వతి అశేష జన బాహుళ్యాన్ని సంఘటిత పరిచేందుకు ఆవును మరింత బలమైన ప్రతీకగా తీర్చిదిద్దాడు. 1880లలో, 1890లలో ముస్లింల గోవధను ఎదిరించడం, తత్ఫలితంగా మతకలహాలు చెలరేగడం అనేక సార్లు జరిగింది. 1966లో జాతీయ స్థాయిలో గోవధను నిషేధించాలన్న డిమాండుతో అన్ని మతతత్వ పార్టీలు పార్లమెంటు ముందు భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. 1979లో ఆచార్య వినోభా భావే దేశ వ్యాప్తంగా గోవధను నిషేధించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్షకు కూచున్నారు. అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ చట్టం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని అస్పష్ట హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించుకున్నారు.
మౌనం *
Posted On at at 9:52 AM by MOVIE
లోకి అడుగు పెట్టాడు హర్ష .
ఓ వృద్ధస్వామి,అతన్ని లోపలికి తీసుకెళ్ళారు,ఆశ్రమ విశేషాలను,విధి విధానాలను వివరించారు .
హర్ష అన్నీ శ్రద్ధ గా విని ,ఆశ్రమంలో ఉండిపోవాలన్న కోరిక వ్యక్తం చేసాడు. దానికి వృద్ధస్వామి
సరేనంటూ , ఉన్నంత కాలం మౌనం గా ఉండాలని , అనుమతి ఇస్తే తప్ప మాట్లాడ కూడదని
చెప్పారు .
హర్ష , హర్షానంద అయ్యాడు .ఆశ్రమం లో రెండేళ్ళు దీక్ష గా గడిచాయి.అప్పుడు రెండు పదాలు
మాట్లాడ టానికి అనుమతి లభించింది .
హర్షానంద చెప్పారు "భోజనం బాలేదు ".తరువాత నుండి చక్కని భోజనం ఏర్పాటు చేయబడింది.
మరో రెండేళ్ళు గడిచాయి , మరో రెండు పదాలు మాట్లాడటానికి అనుమతి లభించింది .
ఈ సారి హర్షానంద అన్నారు "పడక ఇబ్బంది ".ఆ తరువాత మంచి పడక ఏర్పడింది .
ఆరేళ్ళు పూర్తి అయినాయి .పెద్దల అనుమతి తో రెండు పదాలు పలికారు హర్షానంద ,
"ఆశ్రమం వదిలేస్తున్నాను "
విన్న వృద్ధ స్వామి చెప్పారు ,
" నువ్వు ఈ పని ఎప్పుడో చేయవలసింది . వచ్చినప్పటి నుండీ నీ ఇబ్బందుల గురించి
చెప్పటం తప్ప , సాధించింది ఏమీ లేదు.శుభం , వెళ్లిరా నాయనా "
LET'S CELEBRATE HIM: TO మైకేల్ జాక్సన్.
Posted On at at 9:48 AM by MOVIELET'S CELEBRATE HIM: TO మైకేల్ జాక్సన్
Skin head, dead head
Everybody gone bad
Situation, aggravation
Everybody allegation
In the suite, on the news
Everybody dog food
Bang bang, shot dead
Everybody's gone mad
All I wanna say is that
They don't really care about us
All I wanna say is that
They don't really care about us
Beat me, hate me
You can never break me
Will me, thrill me
You can never kill me
Jew me, sue me
Everybody do me
Kick me, kike me
Don't you black or white me
All I wanna say is that
They don't really care about us
All I wanna say is that
They don't really care about us
Tell me what has become of my life
I have a wife and two children who love me
I am the victim of police brutality, now
I'm tired of bein' the victim of hate
You're rapin' me of my pride
Oh, for God's sake
I look to heaven to fulfill its prophecy...
Set me free
Skin head, dead head
Everybody gone bad
trepidation, speculation
Everybody allegation
In the suite, on the news
Everybody dog food
black man, black male
Throw your brother in jail
All I wanna say is that
They don't really care about us
All I wanna say is that
They don't really care about us
Tell me what has become of my rights
Am I invisible because you ignore me?
Your proclamation promised me free liberty, now
I'm tired of bein' the victim of shame
They're throwing me in a class with a bad name
I can't believe this is the land from which I came
You know I do really hate to say it
The government don't wanna see
But if Roosevelt was livin'
He wouldn't let this be, no, no
Skin head, dead head
Everybody gone bad
Situation, speculation
Everybody litigation
Beat me, bash me
You can never trash me
Hit me, kick me
You can never get me
All I wanna say is that
They don't really care about us
All I wanna say is that
They don't really care about us
Some things in life they just don't wanna see
But if Martin Luther was livin'
He wouldn't let this be
Skin head, dead head
Everybody gone bad
Situation, segregation
Everybody allegation
In the suite, on the news
Everybody dog food
Kick me, strike me
Don't you wrong or right me
All I wanna say is that
They don't really care about us
All I wanna say is that
They don't really care about us
All I wanna say is that
They don't really care about us
All I wanna say is that
They don't really care about us
All I wanna say is that
They don't really care about us
All I wanna say is that
They don't really care about us
బ్యాంక్ ఉద్యోగాల పై నిరుద్యోగుల ఆశలు
Posted On at at 9:45 AM by MOVIEఇప్పుడు నిరుద్యోగుల ఆశలు బ్యాంక్ ఉద్యోగాల వైపు మరలినాయి. అది కూడా ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగాల వైపు. ఈ మధ్య నాతో ఒక నిరుద్యోగి తాను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టినట్టు చెప్పాడు. బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయ బ్యాంకా, ప్రైవేట్ బ్యాంకా అని అడిగాను. జాతీయ బ్యాంకే అని చెప్పాడు. ప్రైవేట్ సంస్థల కంటే ప్రభుత్వ రంగ సంస్థలలోనే ఉద్యోగ భద్రత ఎక్కువ ఉంటుందని, అందుకే తాను పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టినట్టు చెప్పాడు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల ఐ.టి. రంగం దివాలా తీసింది. ఇప్పుడు కొంత మంది ఇంజినీరింగ్ విధ్యార్థులు కూడా బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కొన్ని జాతీయ బ్యాంకులకి గ్రామీణ ప్రాంతాలలో కూడా శాఖలు ఎక్కువ ఉండడం వల్ల గతంలో గ్రామీణ నిరుద్యోగులు బ్యాంక్ ఉద్యోగాల పై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు పట్టణ ప్రాంత నిరుద్యోగులు కూడా బ్యాంక్ ఉద్
సూఫీ కవిత్వం - - హాఫీజ్
Posted On at at 9:42 AM by MOVIEఖ్వాజా షామ్సుద్దీన్ మొహమ్మద్ హాఫీజ్ సిరాజి (1315-1390) హాఫీజ్ కవిత్వంలో సౌందర్యం, మార్మికత, ప్రేమ, కరుణ వంటి విశ్వజనీన భావాలు పరిమళిస్తూంటాయి. నిశిత దృష్టి, ఆహ్లాదమైన శైలి, లయ, సరళ భాషతొ ఉండే హాఫీజ్ కవిత్వం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. మరో పర్షియన్ కవి, అత్తర్ వద్ద హఫీజ్ శిష్యరికం చేసాడు.
ఒక పర్షియన్ కవిగా హాఫీజ్ కు మంచి పేరు ఉంది. అది ఎంతంటే ఈతని పుస్తకాలు, ఖురాను కంటే ఎక్కువగా అమ్ముడు పోయేవట.
భారతదేశపు యోగి శ్రీమెహర్ బాబా , హఫీజ్ గీతాలను పాడేవారట.
హఫీజ్ " అశరీర వాణి" అనీ (Tongue of the Invisible), "కవులకే కవి" అని కీర్తి గడించాడు. దేవునిలో లీనమయ్యే మార్గాలను అన్వేషిస్తూ హఫీజ్ ఎన్నో వందల గీతాలను రచించాడు. హఫీజ్ సుమారు 5000 గీతాలు వ్రాసినట్లు ఒక అంచనా. హఫీజ్ తన గీతాలలో ఎక్కడో ఒక చోట తన పేరును పొందుపరచుకొనే వాడు.
మతపెద్దల ధ్వంధ్వ ప్రవృత్తులను తన వ్రాతలలో విమర్శించినందుకు హఫీజ్ తన చరమాంకంలో రాజదండనకు గురి అయ్యాడని అంటారు.
హాఫీజ్ కొరకు మరింత సమాచారం ఇక్కడ
అమెరికాలో పొగడపూలు
Posted On at at 9:37 AM by MOVIEబినీ బేబీస్
Posted On at at 9:32 AM by MOVIEబినీ బెబీస్
సమ్మర్ సెలవులు అనెసరికి పిల్లలకి కాలక్షెపం కొసంకొసం బొలెడు ప్రొగ్రాములు అనౌన్స్ చెస్తారు,ఫలానాచొట ఫలాన రొజు,ఫలానా టైముకి,ఫలాన పొటీ పిల్లలకి జరుగుతుంది మీ పిల్లలని
తీసుకురావాలంటె రిజిస్టెర్ చెయ్యండి అంటారు. అన్నిటికి మన కంప్యూటర్ మామయ్య వున్నాదుగా,ఆయనకి చెపుతె చెసెస్తాడు."శహనాకి ఇవాళ ""బినీ బెబీస్ "ప్రొగ్రాం వుంది దొడ్డా వెళ్దాము అంది రాధిక.పిల్లని తీసుకువెళ్ళాము. మిల్ వాలీ పబ్లిక్ లైబ్రరీ లొ చిల్డ్రెన్స్ రూంలొ జరిగింది.పిల్లలకొసం కెటాయించిన స్థలం,కొన్ని రూములొనూ కొన్ని వాతావరణం బాగుంటె ఆరు బయట చెస్తారు.బినీబెబీస్ ఆరుబయత చెసారు.సంఫ్రంచిస్చొ లొ రొడ్లన్ని ఎత్తులు పల్లాలు.మెలికలు.ఈ లైబ్రరీ కొండ
మీద చెట్ల మధ్య వుంది.బాగా ఎత్తుగా పైన గుబురుగా వుండె చెట్లు ఒకచొట గుంపుగా పదిమంది నులుచుని తలలు దగ్గర పెట్టి ఎదొ సమస్యని చర్చిస్తున్నట్లుగా వున్నాయి.వాటి నీడ ఇంటికప్పులా చల్లగా వుంది.అక్కడొక రాతి తిన్నెవుంది.అక్కడ జరిగింది. పక్కనె చిన్న సెలయెరు ఉషారుగా పరుగెత్తుతున్నది. మెము వెళ్ళెసరికి ప్రొగ్రాము నడిపె ఆవిడ సామాను తొ సహా సిధ్ధంగా వుంది.రెండున్నర ఎళ్ళ వయసు పిల్లల్ని కూడా తల్లులు తీసుకు వచ్చారు.అందరూ చెరాక పిల్లల్ని గుండ్రంగా కూర్చొ పెట్టి తల్లలు, వెంట వచ్చిన వాళ్ళు వాళ్ళ వెనకె కూర్చున్నారు.అందరూమట్టి నెల మీదే కూర్చున్నారు.ఆ చెట్ల నీడ మధ్య రెండుమూడు సూర్య కిరణాలు "ఎంచెస్తున్నారో? చూద్దాము అన్నట్లుగా దూసుకు వచ్చాయి.
ఒకామె బొమ్మల పుస్తకం తెచ్చి కధ చెప్పింది. చెట్లు కావాలంటె నెల బాగుచెసి,ఎరువు వెయాలి,గింజ నాటాలి,నీరుపొయాలి అని చూపించి చెప్పింది.తరువాత అందరికి టెర్రకొట
కుండీలు బుల్లివి ఇచ్చారు.వాటిమీద రంగులతొ డిజైన్స్ వెయ్యడానికి రంగు పెన్సిల్స్ ఇచ్చారు,అంటైంచ డానికి ఒక స్టిక్కెర్ ఇచ్చారు. పిల్లలు గబగబా రంగులు పూసెసారు,వాల్ల పెర్లు కుండీపై వ్రాయమన్నారు, వ్రాసెసారు.పిల్లలు పెయింట్ చెస్తూంటె తల్లులు ఆనంద పడిపొయారు,పిల్లలకి గర్వం చెసామని. తరువాత పిల్లలందరిని పొట్స్ తీసుకొని లైనుగా నిలబడమన్నారు.బుధ్ధిగా నుంచున్నారు.అప్పుదు వాళ్ళ కుండీలలొ ఒకావిడ మట్టిపొసింది,వాళ్ళెతెచ్చారు.మరో ఆవిడ బీన్స్ గింజ దానిలొ నాటింది,మరొ ఆవిడ నీళ్ళు పొసింది..ప్రింట్ చెసిన కార్డ్ ఒకటి ఇచ్చారు,దానిపై"చెట్లుపెంచాలంటెకొంచెం మట్టి,ఒక గింజ,కాసిని నీళ్ళు,కాస్త ఎండ,కాస్త ప్రెమ కావాలని వ్రాసారు.
ఇది అయిపొగానె పిల్ల లందరూ పొలో మంటూ నీళ్ళ దగ్గరికి పరుగ్ర్తారు,తల్లులు కాసెపు నీళ్ళతొ ఆడాక పక్కనున్న లైబ్రరీకి వెళ్ళాము.పెద్దపెద్ద అద్దాల కిటికీలున్న హాలుల్లొ లైబ్రరీ విసాలంగావుంది.బయటికి చూస్తె అందమైన ప్రక్రుతి.నిస్సబ్దం.అందరూ లాప్ తాప్లు తెచ్చుకొని కాఫీతాగుతూ చదువు కొంటున్నారు.లెఖ్ఖ లెనన్ని పుస్తకాలు.చిన్న జీవితం.జన్మంతా వెచ్చించినా
వాటి పేర్లుకూడా చదవలెమోమో?అనిపించింది.పిల్లలు తయారు చెసిన బొమ్మలతొ ఆవిభాగం అంతా అలంకరించారు.లైబ్రరీ వాళ్ళు బూక్ మార్కెలు ప్రింట్ చెసెందుకు బొమ్మలకొసం పిల్లలకి పొటీ పెద్తారట. ఫష్ట్ వచ్చిన వారి బొమ్మ తీసుకు చార్డ్ తయారు చెసి బొమ్మ వెసిన వారి పెరు,వయస్సు
వెస్తారు.ఇలాటివి ఎంతొ ప్రొత్సాహాన్నిస్తాయి.
రాధిక వాళ్ళతొ మెము ఇండియా వెల్తున్నాము వచ్చాక కలుస్తామని చెప్పింది. వాళ్ళు సహనాకి
ఒక తెల్లకాగితాల బూక్,పెంచిల్ ఇచ్చారు,అక్కడి విషెషాలు వ్రాయమని చెప్పారు.వాళ్ళకి ఉత్తరాలు వ్రాయమని కవర్లు,కాగితాలు,స్టాంపులు ఇచ్చారు.ఒకషీటుపై లైన్లు వెసివున్నాయి.రొజు 20 నిముషాలు పుస్తకం చదవాలి,చదివి అందులొ నొతె చెయ్యాలి. ఆకడినుంచి వ్రాసిన ఉత్తరాలు బాగుంటె లైబ్రరీలొ డిస్ప్లె చెస్తారట.చిన్నపిల్లల విభాగంలొ కూడా పెద్ద డిక్ష్నరీలు ఉన్నాయి,పిల్లకి వెరె వున్నాయి.పుస్తకాలు,డ్వ్డ్లు ఇంటికి ఇస్తారు,ఫ్రీగా.పిల్లలు పుస్తాకాలు చదివె అలవాటు పెంచడానికి తల్లులు కూడా శ్రమ్ పడతారు.చిన్నపిల్లల్ని తీసుకు వచి పుస్తకాలు చదివి వినిపిస్తారు. చక్కటి వాతావరణంలొ అక్కడకూర్చుని పుస్తకాలు చదువుకొవాలనిపించింది.
విజేత
Posted On at at 9:30 AM by MOVIEఇంటి పెద్ద కొడుకు కుటుంబం కోసం త్యాగాలు చేయడం ఇతివృత్తంగా బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచీ తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వీటికి భిన్నంగా, అన్నలు వదిలేసిన బాధ్యతని తన భుజాలపై వేసుకుని కుటుంబం కోసం తనకి యెంతో ఇష్టమైన కెరీర్ ని వదులుకున్న ఓ తమ్ముడి కథతో వచ్చిన సినిమా ‘విజేత.’ అప్పటికే మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవి తో త్యాగపూరితమైన పాత్రని చేయించడం సాహసమే. నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై 1985 లో ఈ సాహసం చేశారు. బెంగాలి రచయిత రంజన్ రాయ్ రాసిన కథని ఆధారంగా చేసుకుని అప్పటికే బెంగాలి లోనూ, హిందీ లోనూ తీసిన రెండు సినిమాలూ విజయం సాధించడం తో, అదే కథతో తెలుగులో సినిమా చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు అరవింద్. ‘ఖైదీ’ తో చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన ఏ. కోదండ రామి రెడ్డి దర్శకుడు. రంజన్ రాయ్ కథకి జంధ్యాల సంభాషణలు సమకూర్చారు. రిటైరైన ఉద్యోగి నరసింహం (జే.వి. సోమయాజులు) నాలుగో కొడుకు మధుసూదన రావు (చిరంజీవి). ‘చినబాబు’ అని పిలుస్తారితన్ని ఇంట్లో అందరూ. అన్నలు ముగ్గురూ (రంగనాథ్, గిరిబాబు, నూతన్ ప్రసాద్) ఉద్యోగాలలో స్థిరపడగా, చినబాబు మాత్రం చదువు మీద కన్నా ఫుట్ బాల్ ఆట మీద మక్కువ చూపుతూ పరీక్షలు తప్పుతూ ఉంటాడు. ఇంటి పెద్దకోడలు సరస్వతి (శారద) కి చినబాబన్నా, ఇంటి ఆఖరి ఆడపిల్ల లక్ష్మి (సంయుక్త) అన్నా అభిమానం. పిల్లలు లేని ఆమె వాళ్ళిద్దరినీ తన పిల్లలుగా చూసుకుంటూ ఉంటుంది. ఉమ్మడి కుటుంబలో చిన్నా పెద్దా ఏ అవసరం వచ్చినా చినబాబుకే పురమాయిస్తారు. ఉద్యోగం చేసే చిన్న వదిన (శ్రీలక్ష్మి) చెప్పు తెగిపోతే కుట్టించుకు వచ్చే బాధ్యత కూడా చినబాబుదే. (అప్పటికింకా చిరంజీవి కి మెగాస్టార్ హోదా రాకపోవడంతో, ఈ తరహా సన్నివేశాలలో నటించే అవకాశం దొరికింది) అతనికి చదువు, ఉద్యోగం లేవని వాళ్ళు అతన్ని హేళన చేస్తూ ఉంటారు. చినబాబుని ఉద్యోగస్తుడిగా చూడడం, లక్ష్మికి పెళ్లి చేయడం నరసింహానికి మిగిలిన బాధ్యతలు. ఈ ప్రయత్నాలలో ఉంటాడాయన. చినబాబు స్నేహితురాలు ప్రియదర్శిని (భానుప్రియ) అప్పుడప్పుడూ అతనితో కలల్లో డ్యూయెట్లు పాడుకుంటూ ఉంటుంది. లక్ష్మి కి ఓ మంచి సంబంధం రావడం తో కథ మలుపు తిరుగుతుంది. కొడుకులు నలుగురినీ కూర్చోబెట్టి డబ్బు సర్దుబాటు చేయాలంటాడు నరసింహం. పైవాళ్ళు ముగ్గురూ తమవల్ల కాదంటారు. అంతగా ఐతే ఇల్లు అమ్మేయమని సలహా ఇస్తారు. ఇల్లు అమ్మడం ఇష్టం ఉండదు నరసింహానికి. సరస్వతి మాత్రం తన నగలతో లక్ష్మిని అలంకరించి అత్తవారింటికి పంపుతానంటుంది. డబ్బు సమకూర్చడం ఎలా అన్న సమస్య వేధిస్తుంది నరసింహాన్ని. అంతకు మించి కొడుకుల నిజ రూపం భయపెడుతుంది ఆయన్ని. సరిగ్గా అప్పుడే చినబాబుకి ఫుట్ బాల్ టోర్నమెంట్లో ఆడే అవకాశం వస్తుంది. అదే సమయంలో తండ్రి డబ్బుకోసం కిడ్నీ అమ్మడానికి సిద్ధపడ్డాడని తెలిసి కలవరపడతాడు. కిడ్నీ కోసం ప్రకటన ఇచ్చిన హరిశ్చంద్ర ప్రసాద్ (సత్యనారాయణ) ని కలిసి తన కిడ్నీ తీసుకోవాల్సిందిగా కోరతాడు. ఇక జీవితంలో ఫుట్ బాల్ ఆడే అవకాశం ఉండదని తెలిసినా తన నిర్ణయాన్ని మార్చుకోడు. అటు పెళ్లి ఇటు ఆపరేషన్ ఒకే సారి కావడం తో ముందుగానే డబ్బు తీసుకుని పెద్దక్క శాంత (శుభ) ఇచ్చిందని చెప్పి వదినకి ఇచ్చి హాస్పిటల్లో చేరతాడు. ఆపరేషన్ జరిగాకే ఇంట్లో వాళ్లకి జరిగిందేమిటో తెలుస్తుంది. ఎందుకూ కొరగాడనుకున్న చిన్న కొడుకు చేసిన త్యాగం తండ్రిని కదిలిస్తుంది. ‘చినబాబు మాత్రమే నా కొడుకు.. అతనికి ఇష్టమైతే మీరు ఈ ఇంట్లో ఉండొచ్చు..’ అని ముగ్గురు కొడుకులకీ చెబుతాడు నరసింహం. చిరంజీవికి ఉన్న ఇమేజ్ ని దృష్టి లో పెట్టుకుని ఈ కుటుంబ కథకి ఫైట్లు మాత్రం జత చేశారు..అవి కూడా ప్రధాన కథతో అంతగా సంబంధం లేనివే. ఈ సినిమాలో బాగా నిరాశ పరచేవి పాటలు. నేపధ్యంలో వచ్చే ‘యెంత ఎదిగి పోయావయ్యా..’ పాత మినహా మరే పాటా గుర్తుండదు, మరోసారి చూడాలనిపించదు. సంగీతం సమకూర్చింది చక్రవర్తేనా అన్న సందేహం కలుగుతుంది. (నేనైతే పాటల్ని ఫాస్ట్ ఫార్వార్డ్ చేసేస్తా, ప్రతిసారీ). ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పాత్ర శారదది. మరిది మీద ప్రేమ కురిపిస్తూనే అతన్ని బాధ్యతగా మందలించే చనువున్న వదిన సరస్వతి. ఈ పాత్రలో చాలా చక్కగా ఇమిడిపోయింది శారద. అలాగే చిరంజీవి-జే.వి. సోమయాజులు కాంబినేషన్ సన్నివేశాలు కూడా. ప్రతి పాత్రకీ ఓ ఐడెంటిటీ ఇవ్వడంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ చూపాడు. ఇప్పుడొచ్చే చాలా కుటుంబ కథల్లో తెర నిండా మనుషులు ఉంటారు కాని, అందరూ ఒకేలా ప్రవర్తిస్తూ ఉంటారు, దాదాపుగా.. ప్రధాన పాత్రలతోనే హాస్యం సృష్టించినప్పటికీ, అల్లు రామలింగయ్య మీద ఓ ట్రాక్ పెట్టారు ప్రత్యేకంగా. ఇప్పటి యువ కథానాయకుడు అల్లు అర్జున్ ని బాల నటుడిగా చూడొచ్చు ఈ సినిమాలో. కుటుంబ కథల్ని ఇష్టపడేవాళ్ళు తప్పక చూడాల్సిన సినిమా ఇది.
'విజేత.'
Posted On at at 9:29 AM by MOVIEచిరంజీవి సినిమాల్లో నాకు ఇష్టమైనవి చెప్పమంటే మొదటి ఐదింటి లో ఉండే పేరు 'విజేత.' ఈ ఫ్యామిలీ డ్రామా ని ఎన్ని సార్లు చూసినా విసుగు కలగదు నాకు. అప్పటివరకు ఆకతాయిగా తిరుగుతూనే, కీలకమైన సందర్భంలో ఇంటి బాధ్యతను భుజాల మీద వేసుకునే ఇంటి చిన్న కొడుకు చినబాబు పాత్రలో చిరంజీవి ఒదిగిపోయాడు. సంగీతం ఒక్కటి నిరాశ పరిచినా, మిగిలిన అన్ని విధాలుగా నాకు నచ్చిన సినిమా ఇది. ఈ సినిమా గురించి నా వ్యాసం 'నవతరంగం'
స్వలింగ సంపర్కుల
Posted On at at 9:20 AM by MOVIE3: స్వలింగ సంపర్కులపై (గే)ల హక్కులపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంప్రదాయ భారత సమాజంలో అనేక కొత్త న్యాయ సమస్యలను ఆవిష్కరిస్తోంది. పదేళ్ళ సుదీర్ఘ పోరాటంతో గేలు తమ చర్య చట్టబద్ధమైందేనని తీర్పు పొందగలిగారు. ఇప్పటికే 126 దేశాలు వీరి చర్యలను ఆమోదిస్తూ చట్టాలు చేశాయి. ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ఈ దేశాల జాబితాలో భారత్ కూడా చేరినట్లయింది. కొన్ని పరిస్థితుల్లో వయోజనులకు మాత్రమే దీన్ని పరిమితం చేస్తూ చట్టం చేస్తే తప్పులేదని న్యాయస్థానం భావించింది. దీన్ని అత్యున్నత పార్లమెంట్‌లో చర్చించి చట్టం చేయాలని సూచించింది.
ఈ చర్య కొన్ని పాశ్చాత్య ఐరోపా దేశాల్లో ఆమోదయోగ్యం అయినప్పటికీ పటిష్ఠవంతమైన కుటుంబ వ్యవస్థ, స్త్రీ పురుష అనుబంధాలు, మానవసంబంధాలు ఉన్న భారతదేశంలో ఇలాంటి ప్రకృతి విరుద్ధ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం తగదని సంప్రదాయవాదులు భావిస్తున్నారు. ఈదేశంలో ఎంతటి వయోవృద్ధులైనా కుటుంబంతో కలసి సహజీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వికృత చేష్టలను హైందవ సమాజానికి అన్వయించడం తగదంటూ సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అన్ని మతాలకు చెందిన పెద్దలు కూడా ఈ చర్యను ఆమోదించలేక పోతున్నారు.
అయితే మరో వర్గం వాదన ఇందుకు విరుద్ధంగా ఉంది. పెరుగుతున్న నాగరికత, ఒంటరిగా జీవనం గడుపుతున్న పరిస్థితులు, సినిమా టివిల ద్వారా వయోవృద్ధుల్లో కూడా పెరుగుతున్న కామవాంఛలు సమాజంలో అనేక దారుణాలకు ఆస్కారం కల్పిస్తున్నాయి. వృద్ధులు కూడా పసిపిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మహిళలపై యాసిడ్ దాడులు, అత్యాచారాలు తగ్గాలంటే గే సంస్కృతిని చట్టబద్ధం
చేయాలని వీరు భావిస్తున్నారు. వికటిస్తున్న సెక్స్ ప్రభావానికి అమాయకులు బలికాకుండా ఉండాలంటే ఈ చట్టం ఉపకరిస్తుందని, మహిళలపై దాడులు తగ్గుముఖం పడతాయని పేర్కొంటున్నారు. అయితే ఛాందసవాదులు మాత్రం పాశ్చాత్య దేశాల్లో సరైన కుటుంబ వ్యవస్థ లేని పరిస్థితుల్లో ఇలాంటి వికృత చర్యలకు ఆస్కారం ఏర్పడిందని వాదిస్తున్నారు. కుటుంబ వ్యవస్థ క్షీణించడం, ఒంటరి జీవితాలకు అలవాటుపడ్డం వల్ల వయోవృద్దులు జీవితంలో సంతోషాన్ని, ప్రసాంతతను పొందలేక పోతున్నారని, ఇలాంటి వారంతా గే సంస్కృతికి అలవాటు పడుతున్నారని చెబుతున్నారు. స్వలింగసంపర్కానికి చట్టబద్ధత కల్పిస్తే యువత మాదకద్రవ్యాలకు కూడా అలవాటు పడే ప్రమాదం నెలకొంది. వారి జీవితంలో మానసిక దౌర్బల్యం నెలకొంటొంది. ఆత్మన్యూనతాభావం పెరుగుతుంది. ఇవన్నీ ఆత్మహత్యలకు దారితీస్తాయి. అంతేగాక తాము సహజీవనం చేసిన హోమో భాగస్వామికి చెందిన ఆస్తులపై కూడా హక్కు కోసం పోరాడే అవకాలుంటాయి. సహజీవనం చేసినందున తనకు ఆస్తిలో భాగస్వామ్యం కల్పించాలన్న డిమాండ్ భాగస్వాముల నుంచి ఏర్పడనుంది. ఇవి మరికొన్ని కొత్త న్యాయ సమస్యలు సృష్టించనున్నాయి. ఆస్తి హక్కుపై కొత్తచట్టాలు చేయాల్సి ఉంది. భారతదేశంలో ఒక అంచనా మేరకు 0.80 శాతం మంది హోమోసెక్స్‌వల్స్ ఉన్నట్లు గుర్తించారు. ఒక ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 40 వేల మంది 'గే'లు, 30 వేల మంది లెస్బియన్‌లు ఉన్నట్లు అంచనాకొచ్చారు. కొంతకాలం కిందట మూతబడ్డ ఒక ఇంగ్లీషు వీక్లీకి ఎడిటర్‌గా వ్యవహరించిన ఆశోక్‌రావ్ కవి దేశంలో ఈ హోమో ఉద్యమాన్ని మలుపు తిప్పారు. మూడేళ్ళ క్రితం ఆయన హైదరాబాద్‌లో రహస్యంగా జాతీయ స్థాయి హోమోల సమావేశాన్ని కూడా నిర్వహించారు. అతితక్కువ సంఖ్యలో ఉన్న వీరికోసం పార్లమెంట్ చర్చించి చట్టాలు చేయాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు.
గే సెక్స్ తీర్పుపై వెబ్‌లో దుమారం
న్యూఢిల్లిd, జులై 3: స్వలింగ సంపర్కం చట్టబద్దమేనని ఢిల్లిd హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భారత సమాజం రెండుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. నెటిజన్లు రెండుగా విడిపోయి కత్తులు దూసుకుం టున్నారు. ఢిల్లిd హైకోర్టు తీర్పును కొంత మంది గొప్ప తీర్పుగా అభిర్ణిస్తుండగా, మరికొంత మంది స్వలింగ సంపర్కం అసహజ మనదనీ భారత సంస్కృతికి విరుద్ధమైందని వాదిస్తున్నారు. బ్లాగ్స్‌లోనూ మీడియా వెబ్‌సైట్లల ోనూ గే సెక్స్‌పై వ్యాఖ్యల దుమారం చెలరేగుతోంది. తీర్పు లైంగిక తారతమ్యాన్ని తోసిరా జంటూ వ్యక్తులకు గౌరవం తెచ్చిపెడు తోందని మహారాష్ట్రలోని థానేకు చెందిన ఒక వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, అతను లేదా ఆమె తన ఇష్టానికి అనుకూలంగా జీవించ గలుగుతారని మరొకరు అన్నారు. గే జంటకు ఆలస్యంగా చట్టబద్ధత కల్పించారని, ప్రపంచ వ్యాప్తంగా గేలను అంగీకరిస్తున్నారని, అటువంట ప్పుడు భారత్‌లో అంగీకరించడానికి అభ్యంతర మేమిటని అనేవారు కూడా ఉన్నారు.
'హోమో' తీర్పుపై ప్రధాని పరిశీలన
న్యూఢిల్లిd, జులై 3: గే సెక్స్‌పై ఢిల్లిd హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సంబంధిత చట్టాన్ని మార్చాలా, వద్దా అనే విషయాన్ని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పరిశీలిస్తున్నారు. హోం మంత్రి పి. చిదంబరం, న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ, ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ శుక్రవారం సమావేశమై ఢిల్లిd హైకోర్టు తీర్పుపై విస్తృత చర్చలు జరిపారు. తమ ముగ్గురం ప్రధానికి ఒక నివేదిక సమర్పిస్తామని సమావేశానంతరం మొయిలీ విలేకరులకు చెప్పారు. తీర్పును విశ్లేషించామని, నివేదికను ప్రధానికి ఇస్తామని ఆయన అన్నారు. తమ ముగ్గురు మంత్రులు సమావేశమై ఒక అభిప్రాయానికి రావాలని ప్రధాని తమకు సూచించినట్లు ఆయన తెలిపారు.
ఒక(రోశయ్య) దెబ్బకు రెండు పిట్టలు(చిరంజీవి, చంద్రబాబు)
Posted On at at 6:47 AM by MOVIEరోశయ్య గారిలో ఎవరినీ నొప్పించని మంచి హాస్యం వుంది. ఇద్దరు ప్రత్యర్దులు చిరంజీవి, చంద్రబాబులను ఎలా కొట్టారో మీరే చదవండి. ‘పొగడ్త’ అనే మెత్తని కత్తితో చిరుని, చిరు అనే ఆయుధం తో చంద్రబాబును పొడిచిన ఆయన తీరును మెచ్చుకోకుండా వుండలేము. తెలుగుదేశం పార్టీలో తిరుగుబాట్లకు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ కారణమని ఆరోపిస్తున్న చంద్రబాబు నాయుడికి మతి తప్పినట్లు కనిపిస్తోందని మంత్రి కె రోశయ్య వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఎన్నికల అనంతరం బయటపడుతుంటే వాస్తవాలను గుర్తించకుండా చంద్రబాబు సంయమనం కోల్పోయి ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు. గురువారం మీడియా సమావేశంలో రోశయ్య మాట్లాడారు. తెరాస, తెలుగుదేశం పార్టీల పరిస్థితి దయనీయంగా మారిందని, దాంతో ఆ పార్టీల అధినేతలు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ పార్టీల్లో విభేదాలను పెంచి పోషించే అవసరం కాంగ్రెస్ పార్టీకి గాని, ముఖ్యమంత్రి వైఎస్ గాని లేదని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలిచిన పార్టీని అంగీకరించే కనీస జ్ఞానాన్ని కూడా ఆ నాయకులు కొల్పోయారని ఆయన విమర్శించారు. కొత్తగా పార్టీ పెట్టిన చిరంజీవిని చూసైనా ఈ నాయకులు నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఎవరు బయటకు పోయినా,చివరకు తాను వెళ్ళిపోయినా ప్రజారాజ్యం ఉంటుందని రాజకీయాలకు కొత్త అయినా చిరంజీవి చేసిన ప్రకటన చూసి ఈ నాయకులు నేర్చుకోవాలని, రాజకీయాలలో అలాంటి పరిణితి అవసరమని ఆయన అన్నారు.
Loksatta Awareness Meeting by Students @ Tulsa, OK
Posted On at at 6:27 AM by MOVIE
Hi Everybody,
We, Group of committed & dedicated students from university of Tulsa who are inspired by Loksatta are arranging a ''Loksatta Awareness Meeting'' at Tulsa, oklhoma on June 21st (Sunday) at Marting Regional Library. (2.30 pm - 5 pm)"
We are arranging the meeting with Sai Tej From dallas Chapter , Hari Musapeta, president of Oklahoma telugu association & with the support from different chapters of 'People for Loksatta'. (sravanth, raghava & many other supporters)
We Need Your help. Because, we want to do the same at each university with in 4 years. Please let me know, if Anybody who have good contacts with any other university. We need all kind of support from you & we welcome if any Loksatta supporters from Tulsa, OK .
Details of Meeting:-
Martin Regional Library,
2601 S.Garnett Rd.
Tulsa, OK, 74129
2:30 pm - 5 pm on June 21st, Sunday
Mission:
1. To gather & Inspire youth of our country to make them work for the development of the country.
Our Youth doesn't form 100% of the population of the country, but they do form 100% future of the country
2. Conduct Loksatta Awareness Meeting at each & Every college & University in India & in other countries
3. To Make Aware of Every Citizen's Responsibilities towards his/her nation & Make them contribute for the country.
Nation becomes great, only when citizens of their country knows their responsibilities & fullfil them properly.
Contact me if you need any other details,
చంద్రబాబు చెప్పేశాడు..!!
Posted On at at 6:26 AM by MOVIEసొమ్మొకడిది సోకొకడిది
Posted On at at 6:25 AM by MOVIEసీట్లు మన వాళ్ళవి. పదవులు దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాల వారివి. ఎంత అన్యాయం. ఇంతకన్నా దారుణమయిన ట్రీట్మెంట్ మరే ఇతర రాష్ట్రానికీ దక్కలేదు. ముప్పై మూడు మంది యంపీలను పంపినా కూడా మన రాష్ట్రం పైన కొంత కూడా కృతజ్ఞతా భావం లేకుండా కాంగ్రెస్ పార్టీ వారు ప్రవర్తిస్తున్నారు.తెలుగుదేశం పార్టీ పెట్టిన వెంటనే ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి ఇటువంటి చర్యలే కారణం. రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో తల దూరచలేదు అనే కృతజ్ఞతా భావంతో వైయస్ ఈ విషయంలో పట్టువిడుపుగా వ్యవహరించినట్లున్నారు. ఆరుగురు యంపిలను పంపిన కర్నాటకకి మనకన్నా ఒక మంత్రి ఎక్కువ. మొదటిసారిగా కేంద్ర మంత్రి అవుతున్నవారు కూడా కాబినెట్ మంత్రి పదవినలన్కరించనున్నారు. మన రాష్ట్రానికి మాత్రం ఒకే ఒక కాబినెట్ మంత్రి, మిగిలిన వారంతా సహాయ మంత్రులు. ఇలాంటి అన్యాయం ఇంకెంత కాలమో?
కాంగ్రెస్ వారికి ఎలా ఉందొ తెలియదు కానీ నాకు మాత్రం మింగుడు పడడంలేదు. నా దృష్టిలో మన రాష్ట్ర యంపిలు పేపర్లకి ఎక్కడం, మీడియాకి ఇంటర్వియూలు ఇచ్చి తమ గోడు వెల్లబోసుకోవడం సుద్ధ దండగ.
Posted On at at 6:24 AM by MOVIE
ఆరుగురు యంపిలను పంపిన కర్నాటకకు నాలుగు మంత్రి పదవులు, 16 మంది యంపిలను పంపిన కేరళకు 6 మంత్రి పదవులు, 21 మంది ఉన్న ఉత్తరప్రదేశ్ కు 5 మంత్రి పదవులు. ఇలా పోతా ఉంటే ప్రతీ రాష్ట్రం కంటే మనమే వెనుక బడి ఉన్నాం. మన వారు చేసిన పాపం ఏంటి. మిగిలిన రాష్ట్రాలు చేసిన పుణ్యం ఏంటి.
దాదాపుగా ఒంటి చేత్తో రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి పట్టాభిషేకాన్ని చేసిన ఆంద్ర రాష్ట్ర ప్రజలు "కూరలో కరివేపాకులా". ఇంతా చేసిన ఇవేళ మన్మోహన్ సింగ్ "ప్రతిభ వంటి అంశాలను పరిగణలోకితీసుకున్నాం" అని తెలియజేసారు. మన యంపిలలో లేని ప్రతిభ వరుస కరువులతో బాధపడుతున్న మహారష్ట్రకి ఒక్క సరయిన పరిష్కారాన్ని చూపలేకపోయిన , కరవు పీడిత ప్రజలకు కనీస ఓదార్పుగా కూడా ఉండలేకపోయిన "విలాసరావ్ దేశ్ముఖ్" వంటి వారిలో ఏముందో.
ఇది కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తలదించుకోవలసిన చర్య. తమను అభిమానించి తమ పనితనాన్ని మెచ్చుకున్న రాష్ట్ర ప్రజలను తడిగుడ్డతో గొంతు కోసి నవ్వులపాలు చేసారు.
ఇంతా జరిగితే జాతీయ మీడియా మాత్రం తమ చెత్త బుద్ధి పోనిచ్చుకోలేదు. ప్రధాని, సోనియా, రాహుల్ లను పదే పదే "ఉత్తరప్రదేశ్ కి ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్నారు". కళ్ళకు గంతలు కట్టుకుని ఉత్తరభారతం మాత్రమే ప్రపంచం అనుకుంటున్నారు ఎప్పటిలానే.
ఇంతా చేసి తన కాబినెట్ పని పూర్తి అవ్వగానే తనకు ఇంకేం సబంధం లేదు అని చేతులు దులుపుకుంటూ జెరూసలెం వెళ్లిపోయారు మన ముఖ్యమంత్రి. బావుంది. చాల బావుంది.
భాజాపా మన రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి సీట్లు ఏమీ గెలవక పోవడం మనకు తెలిసిన విషయమే.
Posted On at at 6:23 AM by MOVIE
అయితే పోలయిన వోట్లను చూస్తే ఫర్లేదు, బాగానే వోట్లు సాదిన్చగాలిగారు అనిపిస్తుంది. ఈ క్రింది పట్టికను చూడండి. ఇది భాజాపా తెలంగాణా జిల్లాలలో లోక సభ సీట్లలో సాధించిన వోట్లు.Karimnagar 1,22,337 Adilabad 57,931 Bhongir 45,898 Chevella 1,12,781 Hyderabad 75,503 Khammam 9664 Mahabubabad 16610 Mahabubnagar 57,955 Medak 69027 Nagarkarnool 49,696 Nalgonda 22,590 Nizambad 1,13,756 Pedapalle 67,836 Secunderabad 1,70,382 Warangal 36,064 Zaheerabad 50,189 Malkajgiri 1,30,206